Moto G73 5G Launch : రూ. 20వేల లోపు ధరకే కొత్త మోటో F73 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto G73 5G Launch : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మార్చి 10న భారత మార్కెట్లోకి కొత్త మోటోరోలా 5G ఫోన్ లాంచ్ కానుంది. మోటోరోలా (Motorola) ఈ ఏడాది జనవరిలో కొన్ని గ్లోబల్ మార్కెట్లలో Moto G73 5Gని మొదటిసారిగా లాంచ్ చేసింది.

Moto G73 5G Launch : రూ. 20వేల లోపు ధరకే కొత్త మోటో F73 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto G73 5G with dual cameras, Dimensity 930 SoC tipped to launch in India on March 10

Moto G73 5G Launch : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మార్చి 10న భారత మార్కెట్లోకి కొత్త మోటోరోలా 5G ఫోన్ లాంచ్ కానుంది. అదే.. (Moto G73 5G) కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) ఈ ఏడాది జనవరిలో కొన్ని గ్లోబల్ మార్కెట్లలో Moto G73 5Gని మొదటిసారిగా లాంచ్ చేసింది. భారత వేరియంట్ కూడా ఇలాంటి స్పెసిఫికేషన్‌లతోనే వచ్చే అవకాశం ఉంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్‌లో ప్రకారం.. కొత్త మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 SoCతో పాటు వెనుకవైపు డ్యూయల్ కెమెరాలతో రానుంది.

ఇతర Motorola 5G స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే.. రాబోయే Moto G73 5G ఫోన్ 13 5G బ్యాండ్ సపోర్టు అందించనుందని నివేదిక తెలిపింది. భారత మార్కెట్లోకి G73 లాంచ్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గ్లోబల్ వేరియంట్‌ను పోలి ఉండే Moto G73 5G ఫొటోను కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ బ్లూ కలర్ ఫినిషింగ్‌తో కనిపిస్తుంది. కస్టమర్‌లు మరిన్ని కలర్ ఆప్షన్‌లను పొందవచ్చు. డిస్ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా హోల్-పంచ్ కట్అవుట్‌ను కలిగి ఉంది. వెనుకవైపు కూడా స్మార్ట్‌ఫోన్ అదే కలర్ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ప్రైమరీ వైడ్, అల్ట్రా-వైడ్ కెమెరాలతో రెండు పెద్ద కటౌట్‌లను కలిగి ఉంది. మోటోరోలా కొత్త ‘2um Ultra పిక్సెల్ కెమెరా’తో వస్తుందని కంపెనీ చెబుతోంది.

Moto G73 5G with dual cameras, Dimensity 930 SoC tipped to launch in India on March 10

Moto G73 5G with dual cameras, Dimensity 930 SoC tipped to launch in India

Read Also : New Honda Motorcycle : హీరో స్ప్లెండర్‌కు పోటీగా.. న్యూ హోండా 100CC మోటార్‌సైకిల్ వచ్చేస్తోంది.. మార్చి 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Moto G73 6.5-అంగుళాల Full HD+ LCD డిస్ప్లే, 50-MP ప్రైమరీ సెన్సార్, 8-MP అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీలకు 16-MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించనుంది. Moto G73లో డాల్బీ అట్మోస్ సౌండ్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు, ఛార్జింగ్ USB టైప్-C 2.0 పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉండవచ్చు. ఈ డివైజ్ ప్లాస్టిక్‌ ప్యానెల్‌తో ఉండవచ్చు కానీ, వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.

స్పెసిఫికేషన్ల ప్రకారం.. Moto G73 5G ఫోన్ భారత మార్కెట్లో దాదాపు రూ. 20వేల ధర ఉండవచ్చు. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లలో EUR 299కి లాంచ్ అయింది. అంటే.. భారత మార్కెట్లో దాదాపు రూ. 26,600గా ఉండనుంది. Moto G73 5G ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ఒకే స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉండవచ్చు. ఇతర Motorola స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే.. G73 5G అధికారిక Motorola ఛానెల్‌లు, Flipkartలో అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న Moto G72 ఏకైక 6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.18,999కి విక్రయిస్తోంది. మెటోరైట్ గ్రే, పోలార్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. గత ఫిబ్రవరిలో భారత మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ Moto E13ని లాంచ్ చేసింది. దీని ధర 2GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ రూ.6,999 నుంచి ప్రారంభమవుతుంది. 2023లో Motorola ఇండియా నుంచి రెండవ ఫోన్‌గా Moto G73 లాంచ్ కానుంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలంటే అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే..

Read Also : Motorola Edge 30 Fusion : మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ వివా లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?