Honda Bikes: యమహా ఏరోక్స్ కు పోటీగా రానున్న హోండా “సుప్రా”

పవర్ ఫుల్ మ్యాక్సీ స్కూటర్లను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే యమహా, అప్రిలియా వంటి సంస్థలు ఈ మ్యాక్సీ స్కూటర్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

Honda

Honda Bikes: భారత్ లో సూపర్ బైక్ ల జోరు పెరుగుతుంది. రానురాను పవర్ ఫుల్ బైక్ లపై యువత మక్కువ చూపుతున్నారు. యువత ఆసక్తిని గమనిస్తున్న బైక్ సంస్థలు సైతం కొత్త మోడల్స్ ను భారత మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇక స్కూటర్ల సెగ్మెంట్ లోనూ.. ఈ ధోరణి కనిపిస్తుంది. పవర్ ఫుల్ మ్యాక్సీ స్కూటర్లను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే యమహా, అప్రిలియా వంటి సంస్థలు ఈ మ్యాక్సీ స్కూటర్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చాయి. యమహా ఏరోక్స్ 155, అప్రిలియా SXR 160 స్కూటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈక్రమంలోనే.. హోండా మోటార్ సైకిల్స్ కూడా ఈ ఏడాది ఒక మ్యాక్సీ స్కూటర్ ను భారత్ మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు సమాచారం.

Also Read: China Country: దేశ ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై చైనా నజర్

ఇప్పటికే ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో..హోండా మ్యాక్సీ స్కూటర్లకు మంచి గిరాకీ ఉంది. దీంతో అక్కడి ఏదైనా మోడల్ నే భారత్ లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందని బైక్ రివ్యూ సంస్థలు పేర్కొన్నాయి. ఈక్రమంలో ఇటీవలే హోండా..తన సుప్రా మోడల్ ను అప్డేట్ చేసి పలు దేశాల్లో విడుదల చేసింది. Supra GTR150గా వస్తున్న ఈ మ్యాక్సీ స్కూటర్ నే హోండా ఇండియాలోనూ విడుదల చేయనుందంటూ వార్తలు వచ్చాయి. ఈ హోండా Supra GTR150లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే..

150cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్, 15.4 bhp పవర్ @ 9,000rpm, 13.5 Nm టార్క్‌ @ 6,700rpmను విడుదల చేస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు మోనో-షాక్ సస్పెన్షన్ కలిగి ఉంది. ముందు వెనుక డిస్క్ బ్రేక్ తో వస్తున్న ఈ స్కూటర్ సింగల్ ఛానల్ ABS కలిగిఉంది. డ్యూయల్ LED హెడ్ లాంప్స్ ఈ Supra GTR150 స్కూటర్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తో అధునాతన ఫీచర్స్ అన్ని ఈ మ్యాక్సీ స్కూటర్లో ఉన్నాయి. ప్రస్తుతం వివిధ పేర్లతో ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల్లోనే లభిస్తున్న ఈ స్కూటర్ కే, హోండా.. మార్పులు చేర్పులు చేసి భారత్ మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Bus Driver 190 year Jail: 21 మంది మృతికి కారణమైన బస్సు డ్రైవర్ కు 190 ఏళ్ళు జైలు శిక్ష