China Country: దేశ ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై చైనా నజర్

చైనాలో ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై అక్కడి ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. దేశంపైన, దేశాధ్యక్షుడి పైనా ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారిని దారుణంగా శిక్షిస్తున్నారు.

China Country: దేశ ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై చైనా నజర్

China

China Country: “దేశ ప్రజల వ్యక్తిగత స్వాతంత్య్రన్ని చైనా ప్రభుత్వం హరించివేస్తుంది. మనుషుల కనీస వాక్కు స్వాతంత్య్రన్ని చైనా ప్రభుత్వం తొక్కిపెడుతుంది”. ఇవి.. ఈమధ్య కాలంలో చైనా ప్రభుత్వం గురించి అంతర్జాతీయ మీడియా చేస్తున్న అభియోగాలు. అంతలా ఏం చేస్తుందనేగా మీ డౌట్. చైనాలో ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై అక్కడి ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. దేశంపైన, దేశాధ్యక్షుడి పైనా ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారిని దారుణంగా శిక్షిస్తున్నారు. అంతే కాదు చైనా నుంచి బయటకు వెళ్లే అన్ని సమాచార వ్యవస్థలను(అంతర్జాతీయ మీడియాకు సంబంధించి) క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చైనా దేశానికి, దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా ఎటువంటి సమాచారం లేకపోతేనే వాటిని వదిలేస్తున్నారు. ఇది ఎంతలా మారిందంటే… ఇటీవల అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన ఒక చైనా యువతీని అధికారులు ముప్పతిప్పలు పెట్టారు. సదరు యువతీ అమెరికాలో ఉంటున్న సమయంలో.. హాంకాంగ్ కు మద్దతుగా ట్విట్టర్ లో కామెంట్స్ చేసింది. దీంతో ఆ యువతిని ట్రాక్ చేసిన చైనా అధికారులు.. ఆమెను ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించారట. వెంటనే కామెంట్స్ డిలీట్ చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించి వదిలేసారు. ఈఒక్క కారణం చూస్తేనే అర్ధం అవుతుంది చైనా ఎంతలా ప్రజలపై పెత్తనం చెలాయిస్తుందో.

Also Read: Bus Driver 190 year Jail: 21 మంది మృతికి కారణమైన బస్సు డ్రైవర్ కు 190 ఏళ్ళు జైలు శిక్ష

ఇంతలా చైనా ఎందుకు ప్రవర్తిస్తుంది. అంటే.. చైనా తన ఇరుగుపొరుగు దేశాలను తమ భూభాగంలో కలుపుకోవాలని చూస్తుంది. వారి ఎకానమీలను శాసించాలని చూస్తుంది. ఈక్రమంలో హాంకాంగ్, తైవాన్, టిబెట్ సహా ఇతర చిన్న చిన్న దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఆయా దేశాలు, ప్రాంతాల్లో అశాంతియుత వాతావరణాన్ని ప్రేరేపించి… దేశాలను వశపరుచుకోవాలని చూస్తుంది. ఉయిగూర్ ముస్లింలపై మారణకాండ, భారత్ పై యుద్ధ తంత్రాలు వంటి విషయాలు బహిర్గతం అయ్యాయి. చైనా చర్యలను అగ్రదేశాలు ఖండిస్తున్నాయి. దేశంలో జరిగే ఎటువంటి విషయాన్నైనా రహస్యంగా ఉంచాలని భావిస్తున్న చైనాకు ప్రజలు, మీడియా రూపంలో ఎదురుదెబ్బతగులుతుంది. అందుకే వారిని నొక్కిపట్టే ప్రయత్నం చేస్తుంది చైనా.

Also read: Coonoor Helicopter: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం వాతావరణ తప్పిదమే: మొదటి నివేదిక

దేశానికి, దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగే అన్ని విషయాలను ఒక ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులు నిరంతరం గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో వచ్చే దేశ వ్యతిరేక వ్యాఖ్యలపై ద్రుష్టిసారించిన అక్కడి అధికారులు..వ్యాఖ్యలు చేసిన వారిపై క్రిమినల్, దేశద్రోహం వంటి కేసులు పెడుతున్నారు. ఇది ఎంతలా ఉందంటే.. కేవలం సోషల్ మీడియాల్లో వచ్చే కామెంట్స్ ను ట్రాక్ చేసేందుకు.. ఏకంగా ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ నే తయారు చేసింది చైనా ప్రభుత్వం. ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి..ప్రజల వ్యక్తిగత వ్యవహారాలను, వ్యాపార కార్యకలాపాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఎంతో భద్రతతో కూడిన సందేశాన్ని సైతం ఈ సాఫ్ట్ వేర్ తో పసిగట్టొచ్చు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి యాప్ లు చైనాలో నిషేదంలో ఉన్నప్పటికీ.. అటువంటి యాప్ లు ఉన్న వ్యక్తులు దేశంలోకి వచ్చినప్పుడు వారి ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా చిన్న కామెంట్ ఉన్నా తొలగించాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదంతా గమనిస్తున్న అంతర్జాతీయ మానవహక్కుల సంఘం, మీడియా సంస్థలు, ఇతర పౌరసంఘాలు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మనుషుల ప్రాధమిక హక్కును హరించి వేస్తోందటూ చైనాపై దుమ్మెత్తిపోస్తున్నారు. అంతగా ప్రజలపై నిఘా ఉంచి చైనా ఏం సాదిస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read: Raithu Bandhu: తెలంగాణ వ్యాప్తంగా వారం పాటు రైతుబంధు సంబరాలు