Bus Driver 190 year Jail: 21 మంది మృతికి కారణమైన బస్సు డ్రైవర్ కు 190 ఏళ్ళు జైలు శిక్ష

బస్సును నిర్లక్ష్యంగా నడిపి.. 21 మంది ప్రయాణికుల మృతికి కారణమైన ఒక బస్సు డ్రైవర్ కు మధ్యప్రదేశ్ కు చెందిన స్పెషల్ జడ్జి 190 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు

Bus Driver 190 year Jail: 21 మంది మృతికి కారణమైన బస్సు డ్రైవర్ కు 190 ఏళ్ళు జైలు శిక్ష

Bus Acci

Bus Driver 190 year Jail: బస్సును నిర్లక్ష్యంగా నడిపి.. 21 మంది ప్రయాణికుల మృతికి కారణమైన ఒక బస్సు డ్రైవర్ కు మధ్యప్రదేశ్ కు చెందిన స్పెషల్ జడ్జి 190 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక డ్రైవర్ కు విధించిన అతిపెద్ద శిక్ష దేశ చరిత్రలో ఇదే ప్రధమం కావడం విశేషం. బస్సు డ్రైవర్ మహ్మద్ షంషుద్దీన్‌(45)కు సెక్షన్ 304 (పార్ట్ II) కింద 19 మంది మృతులకు గానూ ఒక్కొక్కరికి 10 సంవత్సరాల చొప్పున మొత్తం 190 సంవత్సరాల జైలు శిక్ష విధించారు జడ్జి. బస్సు యజమాని జ్ఞానేంద్ర పాండేకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.

Also Read: Coonoor Helicopter: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం వాతావరణ తప్పిదమే: మొదటి నివేదిక

2015 మే 4న మధ్యప్రదేశ్ లోని చ్చతర్పుర్ నుంచి పన్నా వెళ్తున్న MP19P0533 అనే బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ మహ్మద్ షంషుద్దీన్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో పన్నా సమీపంలో కల్వర్టు మీదుగా కాలువలో పడిపోయిన బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో చిక్కుకున్న 21 మంది ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అప్పటి పోలీస్ నివేదిక పేర్కొంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై ప్రయాణికులు ముందే హెచ్చరించినా, డ్రైవర్ షంషుద్దీన్‌ పట్టించుకోలేదని సాక్షులు కోర్టులో పేర్కొన్నారు. బస్సులోని అత్యవసర ద్వారాలు సైతం ఇనుప గ్రిల్స్ తో మూసివేయబడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు పై అప్పటి నుంచి విచారణ కొనసాగింది.

Also read: National Politics: రూ.12 కోట్ల విలువైన కారు వాడుతున్న మోదీ ఫకీర్ ఎలా అవుతాడు: శివసేన ఎంపీ

కాగా, దాదాపు 6 సంవత్సరాల తరువాత.. 2021 డిసెంబర్ 31న కేసును విచారించిన స్పెషల్ జడ్జి..బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు తేల్చారు. ఆప్రకారం నమోదైన మూడు సెక్షన్ల కింద( శిక్షించదగిన హత్య, నిర్లక్ష్యం వల్ల మరణం, ర్యాష్ డ్రైవింగ్) బస్సు డ్రైవర్ మహ్మద్ షంషుద్దీన్‌ కు జైలు శిక్ష విధించారు. బస్సు యజమానికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

Also read: Ramgopal Varma: ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఆర్జీవీ