Raithu Bandhu: తెలంగాణ వ్యాప్తంగా వారం పాటు రైతుబంధు సంబరాలు

రైతుల సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రైతు బంధు పథకం. ఏటేటా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యతో పాటు నిధులు కూడా ఆలస్యం కాకుండా అందజేస్తుంది ప్రభుత్వం

Raithu Bandhu: తెలంగాణ వ్యాప్తంగా వారం పాటు రైతుబంధు సంబరాలు

Raithu Bandhu

Raithu Bandhu: రైతుల సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రైతు బంధు పథకం. ఏటేటా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యతో పాటు నిధులు కూడా ఆలస్యం కాకుండానే అందజేస్తుంది గవర్నమెంట్. 2018-19 సంవత్సరం నుంచి ప్రస్తుత సీజన్ కు రూ.2వేల 400 కోట్లు అదనంగా చేర్చి అందజేస్తున్నారు.

ఈ ఏడాది మరోసారి రైతు ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు చేరనున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 3 నుంచి 10వ తేదీ వరకు రైతుబంధు సంబరాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనలు, పరిమితులకు అనుగుణంగానే సంబరాలు జరుపుకోవాలని అధికారులు సూచించారు.

ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురికి సౌండ్ ఇంజినీర్‌తో నిశ్చితార్థం

రైతు బంధు ప్రారంభమైన తొలి ఏడాది 2018-19లో వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి ప్రభుత్వం రూ.10వేల 488కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 147.21లక్షల ఎకరాలు కాగా, యాసంగిలో అది 153.00లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ఏడాది వానాకాలంలో 60.84లక్షల మంది రైతులు ఉండగా, యాసంగిలో ఆ సంఖ్య 66.61లక్షలకు పెరిగింది.