Honor 90 Series Sale Under Rs 11K discount during Amazon Great Indian Festival sale in Telugu
Honor 90 5G Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అక్టోబరు 8 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale)లో హానర్ 90 స్మార్ట్‌ఫోన్ (Honor 90 5G Series Sale) రూ. 11వేల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. ఈ అమెజాన్ సేల్ Snapdragon 7 Gen 1-శక్తితో పనిచేసే హానర్ 90 స్మార్ట్‌ఫోన్ ధరను గణనీయంగా తగ్గిస్తుంది. ఇందులో 200MP ప్రైమరీ కెమెరా, పటిష్టమైన బ్యాక్ ప్యానెల్ ఉన్నాయి. అమెజాన్ ఈ ఏడాదిలో అతిపెద్ద సేల్, అమెజాన్ ఫెస్టివల్ సేల్, అక్టోబర్ 8న ప్రారంభం కానుంది.
హానర్ ఫోన్‌పై స్పెషల్ పండుగ డిస్కౌంట్లు :
ఈ సేల్‌కు ముందు, ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని డీల్‌లు ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్షమయ్యాయి. 3 ఏళ్ల విరామం తర్వాత హానర్ భారత్‌కు తిరిగి వచ్చినందుకు గుర్తుగా హానర్ 90 సిరీస్ ఫోన్ అమెజాన్ ఫెస్టివల్ సేల్ సమయంలో తగ్గింపు ధరతో కూడా అందుబాటులో ఉంటుంది. హానర్ 90 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 200MP ప్రైమరీ కెమెరా, పటిష్టమైన బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు, (Honor 90) అమెజాన్‌లో ప్రత్యేకమైన పండుగ డిస్కౌంట్లను కలిగి ఉంటుంది.
అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్..
అమెజాన్ ప్రైమ్ సభ్యుల (Amazon Prime Members)కు ముందస్తు యాక్సెస్ అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8 నుంచి మెయిన్‌లైన్ స్టోర్‌లు ఇవే డీల్స్‌ను అందిస్తాయి. హానర్ 90 బేస్ మోడల్ (8+256GB) పండుగ డిస్కౌంట్ రూ. 7వేలు, SBI కార్డ్ హోల్డర్‌లకు అదనంగా రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు. కేవలం రూ. 26,999కి తగ్గింది.
Honor 90 5G Sale during Amazon Great Indian Festival sale
అదే విధంగా, హానర్ 90 (12+512GB) వేరియంట్‌ను పొందవచ్చు. అక్టోబరు 8 నుంచి 18 వరకు ఫ్లాట్ రూ. 6వేలు తగ్గింపు, SBI కార్డ్ హోల్డర్‌లు అదనంగా రూ. 4వేల తగ్గింపును పొందవచ్చు. తద్వారా హానర్ 90 ఫోన్ తక్కువ రూ. 29,999కు సొంతం చేసుకోవచ్చు. అదనంగా, కస్టమర్‌లు ఈ హానర్ 90 కొనుగోలుతో రూ. 699 విలువైన కాంప్లిమెంటరీ 30W టైప్-C ఛార్జర్‌ను పొందవచ్చు.
హానర్ 90 స్పెసిఫికేషన్‌లు :
హానర్ 90 సిరీస్ ఫోన్ 6.7-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ పెద్దది కాదు. 2664×1200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్టుఇస్తుంది. 1,600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. మీరు వీడియోలను స్ట్రీమింగ్ చేస్తున్నా, బ్రౌజింగ్ చేస్తున్నా లేదా గేమింగ్ చేస్తున్నా, ఈ డిస్‌ప్లే వ్యూపరంగా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.