Honor Win Turbo : ఒక్క ఛార్జ్‌తో 2 రోజులు.. 10,000mAh బ్యాటరీతో హానర్ విన్ టర్బో ఎంట్రీ.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

Honor Win Turbo : హానర్ విన్ టర్బోలో భారీ 10,000mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 16GB ర్యామ్, 50MP కెమెరాతో ఆకట్టుకునేలా ఉంది. ఈ హానర్ ఫోన్ ధర ఎంతో తెలుసా?

Honor Win Turbo ( Image Credit : AI )

  • హానర్ విన్ టర్బో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ చిప్‌సెట్
  • ఈ ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఆప్షన్
  • డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 27W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్

Honor Win Turbo : హానర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా హానర్ విన్ టర్బో వచ్చేసింది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. 8000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, స్క్రీన్‌ అందిస్తుంది.

భారీ 10,000mAh బ్యాటరీతో 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు (Honor Win Turbo) కూడా సపోర్టు ఇస్తుంది. అనేక ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఈ హానర్ విన్ టర్బో ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం..

హానర్ విన్ టర్బో ధర ఎంతంటే? :
ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3299 యువాన్లు (సుమారుగా రూ. 46,000) ఉంటుంది. ఇందులో కొత్త వేరియంట్, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో ధర 4199 యువాన్లు (సుమారుగా రూ. 58,800) ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ హానర్ విన్ టర్బో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ హానర్ ఫోన్ ఫాస్ట్ గేమ్‌ప్లే, విన్ బై ఛాయిస్, బ్లూ ఫియర్‌లెస్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

Read Also : Boat Smartwatches : వావ్.. బడ్జెట్‌ ఫ్రెండ్లీగా బోట్ 2 కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు అదిరిపోయాయ్!

హానర్ విన్ టర్బో స్పెసిఫికేషన్లు :
హానర్ విన్ టర్బోలో 2640×1200 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 8000 నిట్స్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే ఫ్లాట్‌గా ఉంటుంది. 3840Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఓయాసిస్ ఐ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.

హానర్ విన్ టర్బో, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ LPDDR5X ర్యామ్ యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. హానర్ విన్ టర్బో బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ఉంది. OISకు సపోర్ట్ చేస్తుంది. సెకండరీ సెన్సార్ 5MP,సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

హానర్ విన్ టర్బోలో భారీ 10,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 14 గంటల గేమింగ్, 22 గంటల షార్ట్ వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.