Honor X9b India Launch : అల్ట్రా బౌన్స్ డిస్‌ప్లే ‘ఎయిర్ బ్యాగ్’ టెక్నాలజీతో హానర్ X9b ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Honor X9b India Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీ హానర్ X9b ఫోన్ వచ్చేస్తోంది. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Honor X9b India Launch Date Confirmed; Teased to Get Ultra Bounce Display With 'Airbag' Technology

Honor X9b India Launch : కొత్త హానర్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో హానర్ X9b త్వరలో లాంచ్ కానుంది. భారత మార్కెట్లో కొత్త హానర్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ భారతీయ వేరియంట్ కొన్ని వైవిధ్యాలతో గ్లోబల్ వెర్షన్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Realme 12 Pro Plus 5G Launch : ట్రిపుల్ రియర్ కెమెరాలతో రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ఇటీవల, ఈ ఫోన్ దేశంలోని ఇ-కామర్స్ సైట్‌లో లిస్టు అయింది. రాబోయే మోడల్‌కు సంబంధించిన కలర్ ఆప్షన్లు, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లతో సహా అనేక కీలక వివరాలను లీక్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ధర, లాంచ్ వివరాలు కూడా ఇంతకు ముందే సూచించాయి. ఇప్పుడు, హానర్ టెక్ భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది.

వచ్చే ఫిబ్రవరి 15న హానర్ X9b ఫోన్ లాంచ్ :
వచ్చే ఫిబ్రవరి 15న భారత మార్కెట్లో హానర్ X9b ఫోన్ లాంచ్ చేయనుందని హానర్ టెక్ వెల్లడించింది. ఈ ఫోన్‌లో ‘Airbag’ టెక్నాలజీతో భారత్ మొట్టమొదటి అల్ట్రా బౌన్స్ డిస్‌ప్లే ఉంటుందని కంపెనీ పేర్కొంది. హానర్ X9b ఎస్‌జీఎస్ (SGS) వెరిఫైడ్ 360-డిగ్రీ మొత్తం డివైజ్ ప్రొటెక్షన్ అందిస్తుందని గ్లోబల్ లిస్టింగ్ చెబుతోంది.

హానర్ అల్ట్రా-బౌన్స్ యాంటీ-డ్రాప్ డిస్‌ప్లే త్రి లెవల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌తో స్క్రీన్, ఫ్రేమ్, ఇంటర్నల్ పార్టుల కోసం ప్రత్యేక లేయర్‌ల భద్రతతో వస్తుంది. హానరన్ X9b అమెజాన్ ఇండియాలో కూడా కనిపించింది. సన్‌రైజ్ ఆరెంజ్ షేడ్‌లో 12జీబీ+ 256జీబీ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని లిస్టింగ్ సూచించింది. హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్5ఈతో పాటు 12 నెలల స్క్రీన్, బ్యాక్ కవర్ ప్రొటెక్షన్, 24 నెలల బ్యాటరీ హెల్త్ వారంటీ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Honor X9b India Launch Date 

ఈ ఫోన్ ధర రూ.30వేల మధ్య ఉండవచ్చు :
గతంలో హానర్ ఎక్స్9బీ ఫోన్ హానర్ ఛాయిస్ ఎక్స్5 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కలిపి రూ.35వేల లోపు ఉంటుందని నివేదిక తెలిపింది. అయితే, ఇప్పుడు స్వతంత్రంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 25,000 నుంచి రూ. 30,000 మధ్య ఉండవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్ రూ. రూ. 23,999కు రానుందని లీక్ సూచించింది. హానర్ ఎక్స్9బీ ఫోన్ భారత మార్కెట్లో 12జీబీ వరకు ర్యామ్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో వస్తుంది.

అద్భుతమైన కెమెరా ఫీచర్లు :
గ్లోబల్ మార్కెట్‌లలో ఈ ఫోన్ 6.78-అంగుళాల 1.5K (1,200x 2,652 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్, 108ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో అందుబాటులో ఉంది. ఇందులో 2ఎంపీ మాక్రో షూటర్‌తో కూడిన అల్ట్రా-వైడ్ లెన్స్, 5ఎంపీ సెన్సార్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ కెమెరా 16ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. హానర్ 35డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో హానర్ ఎక్స్9బీలో 5,800ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

Read Also : Apple iPhone 15 Deal : రూ.62వేల లోపు ధరలో ఆపిల్ ఐఫోన్ 15 సొంతం చేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?