Honor X9c 5G
Honor X9c 5G : హానర్ నుంచి కొత్త X9c 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. జూలై 12 నుంచి 14 వరకు జరగనున్న ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ఈ హానర్ 5G కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ధర రూ. 19,999కి అందిస్తోంది.
ఇందులో లాంచ్ డిస్కౌంట్లు, ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. హానర్ X9c ధర రూ. 20వేల కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్, క్వాలిటీ డిజైన్‌తో స్టైలిష్ ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు బెస్ట్ ఫోన్. రూ. 21,999 ధరకు సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ హానర్ X9c 5G ఫోన్ ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
హానర్ X9c ధర, లాంచ్ ఆఫర్లు :
హానర్ ప్రైమ్ డే లాంచ్‌లో భాగంగా హానర్ X9c జూలై 12, జూలై 14 మధ్య లిమిటెడ్ టైమ్ రూ. 19,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ధరలో ఇప్పటికే ఫ్లాట్ రూ. 1,250 డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, SBI, ICICI బ్యాంక్ కార్డ్ యూజర్లు అదనంగా రూ. 750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. రూ. 1,250 లాంచ్ డిస్కౌంట్‌తో కలిపి పొందవచ్చు.
బ్యాంక్ డిస్కౌంట్, ఈఎంఐ ఆఫర్ ఒకేసారి వినియోగించుకోలేరు. కొనుగోలుదారులు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ.7,500 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా హానర్ రూ.1,099 విలువైన వన్ ఇయర్ ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా ఫ్రీగా అందిస్తోంది. ఈ ఫోన్ టైటానియం బ్లాక్, జాడే సియాన్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సింగిల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో పొందవచ్చు.
హానర్ X9c కీ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
హానర్ X9c ఫోన్ 4nm ప్రాసెస్‌పై క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ పెద్ద 6600mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 3 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని హానర్ పేర్కొంది.
ప్రతిరోజూ ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. హానర్ “యాంటీ-డ్రాప్ డిస్‌ప్లే”ను అందిస్తోంది. 2 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్ పడినా డ్యామేజ్ కాదు. ఈ ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP65 సర్టిఫికేట్ కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ కేవలం 7.98mm మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 1.5K రిజల్యూషన్ (2700×1224), 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 3840Hz PWM డిమ్మింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. లో బ్లూ లైటింగ్, ఫ్లికర్-ఫ్రీ వ్యూ కోసం TV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లతో వస్తుంది. బ్యాక్ సైడ్ హానర్ X9c ఫోన్ 108MP మెయిన్ కెమెరాతో ఆప్టికల్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS + EIS) రెండింటినీ కలిగి ఉంది.
కెమెరాలో మోషన్ సెన్సింగ్, AI ఎరేజర్, హై-RES మోడ్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. వివిధ లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన ఫొటోగ్రఫీని అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా MagicOS 9.0పై రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ యాప్స్‌లో డ్రాగ్-అండ్-డ్రాప్ షేరింగ్, గెచర్ నావిగేషన్ మ్యాజిక్ పోర్టల్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంది.