ఆపిల్ ఫోన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి ఐఫోన్ కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇటీవల ఐఫోన్ లో, మ్యాక్ సిస్టమ్ లో వాడే ఫేస్ టైమ్ యాప్ లో ఓ బగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆపిల్ ఫోన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి ఐఫోన్ కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇటీవల ఐఫోన్ లో, మ్యాక్ సిస్టమ్ లో వాడే ఫేస్ టైమ్ యాప్ లో ఓ బగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. జనవరి 28న ఆపిల్ ఈ బగ్ ను గుర్తించింది. ఫేస్ టైమ్ వీడియో కాలింగ్ యాప్ లో ఈ మేజర్ ప్రైవసీ బగ్ ఉన్నట్టు టెస్టింగ్ లో తేలింది. ఈ బగ్ వల్ల యూజర్ ప్రమేయం లేకుండానే వారి మాటలు వినే ప్రమాదం ఉంది. అంతేకాదు.. మీకొచ్చిన వీడియో కాల్ ఆన్సర్ చేయకపోయినా ఫోన్ ఇంటర్నెల్ గా దాగి ఉండి చడిచప్పుడు కాకుండా మీరు చేసే ప్రతిదాన్ని గమనిస్తుంటుంది. ఫేస్ టైమ్ వీడియో కాలింగ్ యాప్ లో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఏదైన పర్సన్ ను యాడ్ చేయమంటూ స్వైప్ అవుతుంది. ఈ యాప్ లో గ్రూపు కాలింగ్ స్టార్ట్ అవుతుంది.
ఇందులో గ్రూపులోని తొలి వ్యక్తికి ఆటోమాటిక్ గా ఆన్సర్ చేయొచ్చు. కానీ, మీకు తెలియకుండానే మీరు మాటలు ఇతరులకు కూడా వినిపిస్తుంది. ఈ బగ్ కు సంబంధించి ఆపిల్ యూజర్లకు అవగాహన కల్పించేందుకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఫేస్ టైమ్ యాప్ లో బగ్ ను గుర్తించాం. ఈ వారంలో విడుదలయ్యే సాఫ్ట్ వేర్ అప్ డేట్ లో బగ్ ను ఫిక్స్ చేస్తాం. అప్పటివరకూ యాప్ లో గ్రూపు చాట్ ఆప్షన్ తాత్కాలికంగా డిసేబుల్ చేస్తున్నాం’’ అని తెలిపింది. ఫేస్ టైమ్ యాప్ లో బగ్ ను ఫిక్స్ చేసేంతవరకు యూజర్లు ఈ కింది విధంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఐఓఎస్ డివైజ్ లు (ఐఫోన్లు, ఐపాడ్స్)
1. సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లండి
2. ఫేస్ టైమ్ యాప్ కు స్ర్కోల్ డౌన్ చేయండి
3. ఫేస్ టైమ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి
మ్యాక్ సిస్టమ్స్ కోసం..
1. ఫేస్ టైమ్ యాప్ ఓపెన్ చేయండి
2. టాప్ లెఫ్ట్ కార్నర్ కు ఫేస్ టైమ్ యాప్ ను స్ర్కోల్ చేయండి
3. ఫేస్ టైమ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి