Device ఏదైనా.. Process ఒక్కటే : Instagramలో Email ఈజీగా మార్చుకోండి

  • Published By: sreehari ,Published On : November 30, 2019 / 05:47 AM IST
Device ఏదైనా.. Process ఒక్కటే : Instagramలో Email ఈజీగా మార్చుకోండి

Updated On : November 30, 2019 / 5:47 AM IST

మీరు Instagram వాడుతున్నారా? మొబైల్ యాప్ లేదా డెస్క్ టాప్ కావొచ్చు. ఏ డివైజ్ నుంచి అయినా ఈజీగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రైమరీ ఈమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు. ఒకసారి అకౌంట్ క్రియేట్ చేశాక.. ప్రైమరీ ఈమెయిల్ వద్దనుకుంటే.. మరో కొత్త ఈమెయిల్ ఐడీని యాడ్ చేసుకోవచ్చు. మీ Instagram అకౌంట్ Lock కాకుండా ఈమెయిల్ ద్వారా Unlock చేసుకునే సదుపాయం ఉంది. అందుకే ఎప్పటికప్పుడూ Instagramలో మీ ఈమెయిల్ అడ్రస్ Up-to-date ఉండాలి. 

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా అకౌంట్ల భద్రత పెద్ద సవాల్ గా మారుతోంది. మీ సోషల్ అకౌంట్లను సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా సెక్యూర్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత సమాచారం, ఫొటోలు ఇతరలు యాక్సస్ చేసుకునే ముప్పు ఉందని మరవొద్దు. అందుకే మీ అకౌంటు సేఫ్ గా ఉండేందుకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అప్ డేటెడ్ గా ఉండాలంటున్నారు టెక్ నిపుణులు.

Instagram విషయంలో మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే.. Instagram తమ యూజర్ల కోసం ఈమెయిల్ అడ్రస్ వెంటనే ఈజీగా అప్ డేట్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఒకవేళ పాత ఈమెయిల్ అడ్రస్ Instagramలో యాక్సస్ చేసుకోలేకపోతే కొత్త ఈమెయిల్ ఐడీ ద్వారా Sign-up ఈజీగా చేసుకోవచ్చు. ఫొటో షేరింగ్ యాప్ Instagram యాప్ లేదా Desktop Instagram వెబ్ సైట్ లో ఈమెయిల్ అడ్రస్ ఎలా Update చేసుకోవాలో ఓసారి చూద్దాం.

Mobile Appలో ఇలా :
* మీ iPhone లేదా Android హోం స్ర్కీన్ Instagram యాప్ ఓపెన్ చేయండి.
* Home Sceren కిందిభాగంలో lower-right Menu.. Profile iconపై Tap చేయండి.
* మీ Profile Page డిస్ ప్లే అవుతుంది.
* Edit Profile అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై Tap చేయండి.
*  Private Information కింద మీకు Email Filed కనిపిస్తుంది.
* ఈమెయిల్ అడ్రస్ లిస్టుపై Click చేయండి.
* చిన్న పరిమాణంలో ‘X’ గ్రే సింబల్ పై Click చేయండి.
* Upper right hand కార్నర్ లో Done ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
* ఇక్కడే మీ కొత్త ఈమెయిల్ అడ్రస్ మార్చుకోవచ్చు.

Desktop వెర్షన్ పై ఇలా :
*  మీ ఆపరేటింగ్ సిస్టమ్ Mac లేదా Windows PC ఏదైనా కావొచ్చు.
* Instagram.com Website విజిట్ చేయండి.
* మీ Username, Password తో Login చేయండి.
* మీ Usernameపై Click చేయగానే Profile Page ఓపెన్ అవుతుంది. 
* ఇక్కడ Edit Profile బటన్ పై Click చేయండి.
* Email Filed దగ్గర ప్రస్తుతం ఉన్న పాత ఈమెయిల్ అడ్రస్ తొలగించండి.
* ఇప్పుడు కొత్త Email అడ్రస్ ఎంటర్ చేయండి. 
* Submit బటన్ పై Click చేస్తే చాలు.. వెంటంనే ఈ-మెయిల్ మారిపోతుంది.