Elon Musk Net Worth : మస్క్ మామ ముఖేష్ అంబానీ కన్నా 4 రెట్లు ధనవంతుడు.. నికర సంపద 400 బిలియన్ డాలర్లు దాటేసింది..!

Elon Musk Net Worth : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచిన తర్వాత ఎలన్‌ మస్క్‌ సంపద రోజురోజుకి రెట్టింపు అవుతోంది. ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి.

How Elon Musk became the first person with net worth of 400 billion dollars in list

Elon Musk Net Worth : ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ నికర సంపద రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు, మస్క్ మామ 400 బిలియన్ డాలర్ల (రూ. 38 లక్షల కోట్లు)ను దాటింది. ఇప్పటివరకు ఏ బిలియనీర్ కూడా సంపాదించని సంపాదనతో మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గత నెలలో మస్క్ నికర విలువ 447 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా మస్క్ నిలిచాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచిన తర్వాత ఎలన్‌ మస్క్‌ సంపద రోజురోజుకి రెట్టింపు అవుతోంది. ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో ఎలన్ మస్క్ నికర విలువ 62 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.

ముఖేష్ అంబానీ కన్నా 4 రేట్లు ఎక్కువ సంపద :
మస్క్ నికర విలువ ముఖేష్ అంబానీ కన్నా నాలుగు రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ నికర విలువ 97.1 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ నికర విలువ 79.3 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడైన అమెజాన్ జెఫ్ బెజోస్ నికర విలువ మస్క్ కన్నా చాలా తక్కువ. బెజోస్ నికర విలువ 249 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఒక్క రోజులో 63 బిలియన్ డాలర్ల సంపాదన :
గత 24 గంటల్లో ఎలన్ మస్క్ 62.8 బిలియన్ డాలర్లు సంపాదించాడు. ఒకరోజు సంపాదన ప్రపంచంలోని చాలా మంది బిలియనీర్ల కన్నా ఎక్కువగా నమోదైంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోని 23వ అత్యంత సంపన్న వ్యక్తి మొత్తం నికర విలువ 63.2 బిలియన్ డాలర్లు. మస్క్ ఒక రోజు సంపాదన ప్రపంచంలోని ఇతర ధనవంతుల మొత్తం నికర విలువను దాటేసింది.

ఈ సంవత్సరంలో మస్క్ ఇప్పటివరకు 218 బిలియన్ డాలర్లను సంపాదించాడు. మస్క్ ఒక ఏడాది సంపాదనను తన మొత్తం సంపాదనతో పోలిస్తే.. ప్రపంచంలోనే నాల్గవ సంపన్నుడు. మస్క్ మొత్తం నికర విలువ 200 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా కలిగిన ఇద్దరు దిగ్గజాలు మాత్రమే ఉన్నారు. ఇందులో జెఫ్ బెజోస్, మెటా మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. జుకర్‌బర్గ్ నికర విలువ 224 బిలియన్ డాలర్లు.

మస్క్ అంత డబ్బు ఎలా సంపాదించాడంటే? :
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత, మస్క్ నికర విలువ గణనీయంగా పెరిగింది. మస్క్ కంపెనీ టెస్లా షేర్లు పెరగడం వల్ల ఆయన సంపద ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఒక రోజు క్రితం టెస్లా షేర్లు దాదాపు 6 శాతం పెరిగాయి.

నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ఒక రోజు ముందు, నవంబర్ 4న టెస్లా షేర్ ధర 242.84 డాలర్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ 12న టెస్లా షేర్ల ధర 424.77 డాలర్లు. ట్రంప్ విజయం తర్వాత టెస్లా షేర్లు సుమారు 75 శాతం పెరిగాయి. టెస్లా కాకుండా, మస్క్ సంపద ఇతర కంపెనీలైన ఎక్స్ఏఐ, స్పేస్ఎక్స్ ద్వారా కూడా భారీగా సంపద పెరిగింది.

Read Also : WhatsApp Translate Chat : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. త్వరలో చాట్ మెసేజ్‌లను మీకు ఇష్టమైన లాంగ్వేజీలోకి ట్రాన్సులేట్ చేయొచ్చు!