WhatsApp Translate Chat : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. త్వరలో చాట్ మెసేజ్‌లను ఈజీగా ట్రాన్సులేట్ చేయొచ్చు!

WhatsApp Translate Chat : వాట్సాప్ లాంగ్వేజీలలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల వెర్షన్ 2.24.26.9తో బీటా టెస్టింగ్‌లో ఉంది.

WhatsApp Translate Chat : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. త్వరలో చాట్ మెసేజ్‌లను ఈజీగా ట్రాన్సులేట్ చేయొచ్చు!

WhatsApp may soon be able to translate chat messages

Updated On : December 12, 2024 / 11:42 PM IST

WhatsApp Translate Chat : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్‌ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వస్తోంది. ఇకపై వాట్సాప్ యూజర్లు తమ చాట్‌లోని మెసేజ్‌‌లను సులభంగా ట్రాన్సులేట్ చేయొచ్చు. యూజర్ బేస్‌ని మరింత పెంచుకునేందుకు వాట్సాప్ చాట్ మెసేజ్‌లు, ఛానెల్ అప్‌డేట్‌లను ఆటోమాటిక్‌‌గా ట్రాన్సులేట్ చేసే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదించింది.

రాబోయే ఈ ఫీచర్‌ ప్రకారం.. వాట్సాప్ లాంగ్వేజీలలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల వెర్షన్ 2.24.26.9తో బీటా టెస్టింగ్‌లో ఉంది. వినియోగదారులు వారి ప్రైవసీ లేదా భద్రతకు భంగం కలగకుండా లాంగ్వేజీ పరమైన సమస్యలను సజావుగా ఛేదించడంలో సాయపడేందుకు ఈ ఫీచర్ తీసుకొస్తోంది.

ట్రాన్సులేషన్ ప్రక్రియ పూర్తిగా యూజర్ డివైజ్‌లో వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కట్టుబడి ఉంటుందని నివేదిక వెల్లడించింది. క్లౌడ్ సర్వర్‌లకు డేటాను పంపే సంప్రదాయ ట్రాన్సులేషన్ టూల్స్ మాదిరిగా కాకుండా, ఈ ఫీచర్ ప్రీ-డౌన్‌లోడ్ చేసిన లాంగ్వేజీ ప్యాక్‌లను ఉపయోగిస్తుంది, థర్డ్-పార్టీ సర్వీసులు లేదా వాట్సాప్ సర్వర్‌లతో కూడా డేటా షేర్ అవుతుందని నిర్ధారిస్తుంది.

ఫీచర్ డెవలప్ స్టేజీలో ఉన్నప్పుడు వినియోగదారులు ఆఫ్‌లైన్ ఉపయోగం కోసం అవసరమైన లాంగ్వేజీ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా వినియోగదారులు స్థానికంగా ట్రాన్సులేషన్ ప్రారంభించవచ్చు. ఆఫ్‌లైన్ ట్రాన్సులేషన్ ఈ విధానం వినియోగదారులను ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రాన్సులేషన్ యాక్సెస్ చేసేందుకు యూజర్లకు మరింత ప్రైవసీని అందిస్తుంది.

అదనంగా, వినియోగదారులు నిర్దిష్ట మెసేజ్‌లను మాన్యువల్‌గా ట్రాన్సులేట్ లేదా అన్ని కొత్త మెసేజ్‌లు, ఛానెల్ అప్‌డేట్స్ కోసం ఆటోమేటిక్ ట్రాన్సులేషన్ ప్రారంభించాలా లేదా అని నిర్ణయించుకోవచ్చు. ఈ ఆప్షనల్ సాధారణ భాషల అంతటా అధికారిక కమ్యూనికేషన్ రెండింటికీ సపోర్టు చేస్తుంది.

నివేదిక ప్రకారం.. ట్రాన్సులేషన్ ఆఫ్‌లైన్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా వాట్సాప్ డేటా సెక్యూరిటీ, యూజర్ ప్రైవసీని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, కొన్ని ట్రేడ్-ఆఫ్‌లు ఉన్నాయి. ఎక్స్‌ట్రనల్ ట్రాన్సులేషన్ ఇంజిన్‌ల నుంచి రియల్ టైమ్ అప్‌‌డేట్స్ కన్నా ముందే డౌన్‌లోడ్ చేసిన లాంగ్వేజీ ప్యాక్‌లపై ఆధారపడింది. ఆఫ్‌లైన్ ట్రాన్సులేషన్ ఎల్లప్పుడూ కచ్చితమైనవి కావని నివేదిక పేర్కొంది. ట్రాన్సులేషన్ అర్థం చేసుకునేలా ఉన్నప్పటికీ వినియోగదారులు అప్పుడప్పుడు తప్పులను ఎదుర్కోవచ్చు.

అయితే, ఈ లిమిట్స్ ఉన్నప్పటికీ, ఈ ఫీచర్ వినియోగదారులను కనెక్ట్ అయ్యేందుకు క్రాస్-లాంగ్వేజ్ కమ్యూనికేషన్‌ని ఎనేబుల్ చేసేందుకు అనుమతిస్తుంది. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ప్రయోజనాల కోసం వివిధ భాషలు మాట్లాడే యూజర్ల మధ్య చాట్స్ సులభతరం చేస్తుంది.

లభ్యత విషయానికొస్తే.. అధికారికంగా రిలీజ్ తేదీని ప్రకటించలేదు. కానీ, ఈ ఫీచర్ ఇంకా డెవలప్ స్టేజీలో ఉంది. మరిన్ని అప్‌గ్రేడ్స్, టెస్టింగ్స్ తర్వాత వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ భవిష్యత్తులో అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, బీటా టెస్టర్‌లు ప్రారంభ వెర్షన్ యాక్సస్ చేయగలరు.

Read Also : Vivo X200 Series Launch : వివో కొత్త X200 సిరీస్ చూశారా? ఒకటి కాదు.. రెండు ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?