PAN Card 2.0 : కొత్త పాన్ కార్డు 2.0 తీసుకున్నారా? ఎలా అప్లయ్ చేయాలి? ఇదిగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

PAN Card 2.0 : కొత్త పాన్ కార్డు 2.0 కోసం దరఖాస్తు చేశారా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఈజీగా క్యూఆర్ కోడ్ పాన్ కార్డు పొందొచ్చు..

PAN Card

PAN Card 2.0 : కొత్త పాన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. పాన్ కార్డుహోల్డర్ల (PAN Card 2.0) కోసం ఆదాయ పన్ను శాఖ సరికొత్త పాన్ 2.0 అప్ గ్రేడ్ తీసుకొచ్చింది.

ఇకపై ఈ కొత్త పాన్ కార్డు అత్యంత సెక్యూరిటీని అందిస్తుంది. QR కోడ్‌ కొత్త సిస్టమ్ ద్వారా e-PAN అథెంటికేషన్, దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు.

అయితే, e-PAN డిజిటల్ వెర్షన్ ఉచితంగా పొందొచ్చు. ఇమెయిల్ ద్వారా వెంటనే వస్తుంది. పాన్ కార్డు రుసుము చెల్లించడం పొందవచ్చు.

మీ ప్రస్తుత పాన్ కార్డ్ వ్యాలీడ్ ఉంటుంది. QR కోడ్ లేకపోయినా పనిచేస్తుంది. మీరు PAN 2.0 కార్డ్, e-PAN కోసం అప్లయ్ చేయాలంటే ఈ కింది వివరాలను తప్పక తెలుసుకోవాలి.

Read Also : BSNL Roaming Plan : పండగ చేస్కోండి.. ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారా? ఈ 18 దేశాల్లో BSNL కొత్త రోమింగ్ ప్లాన్.. ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్..!

పాన్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఇదేనా? :
భారత్‌లో పాన్-సంబంధిత సర్వీసులకు 2 అధికారిక ఏజెన్సీలు ఉన్నాయి. Protean ప్రోటీన్ (గతంలో NSDL ఇ-గవర్నెన్స్) ఒకటి. UTI ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL) ఏజెన్సీ రెండోది.

అయితే, మీ ప్రస్తుత పాన్ కార్డును ఏ ఏజెన్సీ జారీ చేసిందో తెలుసుకునేందుకు కార్డు బ్యాక్ సైడ్ చెక్ చేయండి. ఆ తర్వాత ఆ ఏజెన్సీ ద్వారానే అప్లయ్ చేసుకోవచ్చు. QR కోడ్‌ ప్రక్రియ ద్వారా మరింత పాన్ కార్డుకు మరింత సెక్యూరిటీని అందిస్తుంది.

పాన్ కార్డ్ 2.0 (Protean) అప్లయ్ చేసుకోండిలా :

  • ప్రోటీన్ పాన్ రీప్రింట్‌లో అధికారిక రీప్రింట్ పోర్టల్‌ను విజిట్ చేయండి.
  • మీ పాన్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి డిక్లరేషన్‌కు (Agree) ఎంచుకోండి.
  • ఆపై Submit క్లిక్ చేయండి.
  • మాస్క్డ్ పాన్ వివరాలను వెరిఫై చేయండి.
  • OTP (మొబైల్/ఇమెయిల్) ఎక్కడ పొందాలో ఎంచుకోండి.
  • మీ పాన్ డెలివరీ అడ్రస్ కన్ఫార్మ్ చేయండి.
  • OTP వచ్చాక ఎంటర్ చేసి 10 నిమిషాలలోపు వెరిఫై చేయండి.
  • పేమెంట్ పేజీకి వెళ్లి టర్మ్స్ అంగీకరించాలి. రీఫ్రింట్ రుసుము రూ. 50 చెల్లించండి.
  • పేమెంట్ చేశాక రిసిప్ట్ జనరేట్ అవుతుంది.
  • 24 గంటల తర్వాత మీ e-PAN డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడే సేవ్ చేయండి.
  • రీప్రింటెడ్ పాన్ కార్డ్ 15 నుంచి 20 వర్కింగ్ డేస్‌‌లో మీ రిజిస్టర్డ్ పోస్టల్ అడ్రస్‌కు వస్తుంది.
  • డిజిటల్ ఇ-పాన్ కార్డు ఇమెయిల్ ద్వారా పొందవచ్చు.