Credit Cards
Credit Cards : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు కామన్. చాలామంది అవసరం ఉన్నా లేకున్నా ఒకటికి మించి క్రెడిట్ (Credit Cards) కార్డులను తీసేసుకుంటున్నారు. ఆఫర్ ఉందని ఒకరు.. అవసరం ఉండొచ్చుని మరొకరు ఇలా ఏదో ఒక అవసరం పేరుతో నాలుగు ఐదు క్రెడిట్ కార్డులను వాడేస్తున్నారు.
Read Also : Home Loans : హోం లోన్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. కేవలం 5 నెలల్లో మూడోసారి ఈఎంఐ తగ్గుతుందోచ్..!
ఇందులో వాడేవి ఒకటి రెండు అయితే మిగతావి అలా ఉంచుకుంటారు. అయితే, ఈ క్రెడిట్ కార్డుల్లో ఏదైనా క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసుకుందామని అనుకుంటున్నారా?
అయితే, మీరు కాస్త ఆగండి.. క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసే కొన్ని విషయాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలి. లేదంటే మీ క్రెడిట్ స్కోరు ఒక్కసారిగా దెబ్బతినే అవకాశం లేకపోలేదు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? :
ఇంతకీ క్రెడిట్ కార్డు (Credit Cards) ఒకటికి మించి ఉంటే అలానే ఉంచుకోవాలా? లేదా క్యాన్సిల్ చేయాలా? అలా చేస్తే క్రెడిట్ స్కోరు తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డును క్యాన్సిల్ చేయడం చాలా ఈజీ. ఎక్కువ కార్డులంటే అందులో ఏది క్యాన్సిల్ చేయాలో చెప్పడం కష్టమే. ఏది రద్దు చేసినా క్రెడిట్ స్కోరు ఎఫెక్ట్ అవుతుంది.
చాలావరకూ క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసేవారు యానివల్ ఫీజులు ఎక్కువని, వడ్డీ అధికంగా ఉందని, పెద్దగా బెనిఫిట్స్ ఏం లేవని క్యాన్సిల్ చేద్దామని భావిస్తుంటారు. మీరు ఏదైనా క్రెడిట్ కార్డు వద్దనుకుంటే.. అకౌంట్ క్లోజ్ చేస్తున్నారని గమనించాలి.
ఇలా చేస్తే క్రెడిట్ లోన్ కూడా తగ్గిపోతుంది. మిగతా కార్డులో లోన్ వినియోగ నిష్పత్తి పెరిగిపోతుంది. ఇది 30 శాతం కన్నా ఎక్కువగా ఉంటే అప్పులపై మీరు ఎక్కువగా ఆధారపడతారని బ్యాంకులు భావిస్తాయి.
రుణ వినియోగం పెరిగితే క్రెడిట్ స్కోరు కూడా వేగంగా తగ్గుతుంది. పాత క్రెడిట్ కార్డులకు మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటుంది. 10 ఏళ్లకు మించి వాడే క్రెడిట్ కార్డులను అసలు క్యాన్సిల్ చేయొద్దు.
క్యాన్సిల్ చేసే ముందు ఏం చేయాలి? :