Home Loans : హోం లోన్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. కేవలం 5 నెలల్లో మూడోసారి ఈఎంఐ తగ్గుతుందోచ్..!

Home Loans : ఆర్‌బీఐ రెపో రేటును మూడవసారి తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇక గృహ రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది.

Home Loans : హోం లోన్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. కేవలం 5 నెలల్లో మూడోసారి ఈఎంఐ తగ్గుతుందోచ్..!

Home Loans

Updated On : June 6, 2025 / 12:35 PM IST

Home Loans : హోం లోన్ కస్టమర్లకు శుభవార్త.. ఆర్బీఐ 5 నెలల్లో మూడోసారి రెపో రేటును తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో రెపో రేటు 5.50 శాతానికి తగ్గింది.

ఫలితంగా గృహ రుణాలపై ఈఎంఐ (Home Loans) భారీగా తగ్గనుంది. చాలా కాలంగా ఈఎంఐ భారంతో ఇబ్బందిపడుతున్న గృహ రుణగ్రహీతలకు బిగ్ రిలీఫ్.

Read Also : RBI Repo Rate : సామాన్యులకు పండగే.. హోం, కార్ల లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి.. ఈఎంఐలు దిగొస్తాయి..! 

ఆర్‌బీఐ ద్రవ్య విధాన (MPC) సమావేశం జూన్ 4న ప్రారంభమైంది. ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా జూన్ 6న ఉదయం 10 గంటలకు రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలో ఆయన మూడోసారి రెపో రేటును తగ్గించారు.

ప్రపంచ అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితిలో భారత్‌లో విదేశీ పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

5.50 శాతానికి తగ్గిన రెపో రేటు :
ఇప్పుడు రెపో రేటు 5.50 శాతానికి తగ్గింది. బ్యాంకులు, గృహ రుణాలు సహా ఇతర రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉంటుంది. కొత్త, పాత గృహ రుణ వినియోగదారులు భారీగా ప్రయోజనం పొందుతారు.

ఆర్‌బీఐ రెపో రేటును 0.50 శాతం తగ్గించింది. ఆర్థికవేత్తలు, నిపుణులు రెపో రేటులో 0.25 శాతం తగ్గిస్తుందని భావించారు. అంతకన్నా ఎక్కువగానే ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది.

అంచనాల కన్నా రెపో రేటు తగ్గింపు :
రెపో రేటు తగ్గింపు పాత, కొత్త గృహ రుణ వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 0.50 శాతం రెపో రేటు అంటే.. బ్యాంకులు, NBFC గృహ రుణాలు, ఆటో రుణాలపై వడ్డీ రేటును వెంటనే తగ్గించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం, అనేక ప్రభుత్వ బ్యాంకుల గృహ రుణాలపై వడ్డీ రేటు 7.75, 9 శాతం మధ్య ఉంది. రెపో రేటులో అర శాతం తగ్గింపుతో గృహ రుణాలపై వడ్డీ కనీసం 7.25 శాతానికి తగ్గుతుంది.

5 నెలల్లో ఒక శాతం తగ్గిన రెపో రేటు (Home Loans) :
ఈ ఏడాది ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడం మూడోసారి. ఫిబ్రవరిలో తొలిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏప్రిల్‌లో రెండోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు మూడోసారి రెపో రేటును 0.50 శాతం తగ్గించింది. 6.5 శాతంగా ఉన్న రెపో రేటు 5.50 శాతానికి తగ్గింది.

రుణగ్రహీతలకు ప్రయోజనాలేంటి? :
బ్యాంకులు, NBFC ఇకపై గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించాల్సిందే. ఎందుకంటే.. ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. మీరు గృహ రుణం తీసుకుంటే.. బ్యాంక్ వడ్డీ రేటును తగ్గించే వరకు వేచి ఉండాలి. ఫ్లోటింగ్ రేటుపై రుణం తీసుకుంటే.. వడ్డీ రేటు ఆటోమాటిక్‌గా తగ్గుతుంది.

Read Also : Loans EMI : ఆర్బీఐ బిగ్ సర్‌ప్రైజ్.. ఊహించని విధంగా రెపో రేట్ కట్.. భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!

తద్వారీ మీ ఈఎంఐ ఒక్కసారిగా తగ్గుతుంది. మీ బ్యాంక్ వడ్డీ రేటును తగ్గించకపోయినా లేదా స్థిర వడ్డీ రేటుపై రుణం తీసుకున్నా మీ రుణాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు.