Loans EMI : ఆర్బీఐ బిగ్ సర్‌ప్రైజ్.. ఊహించని విధంగా రెపో రేట్ కట్.. భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!

Loans EMI : చౌకగా లోన్లను అందించేలా ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. లోన్లపై ఈఎంఐలు కూడా భారీగా తగ్గుతాయి.

Loans EMI : ఆర్బీఐ బిగ్ సర్‌ప్రైజ్.. ఊహించని విధంగా రెపో రేట్ కట్.. భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!

Loans EMI

Updated On : June 6, 2025 / 12:06 PM IST

Loans EMI : ఆర్బీఐ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఊహించిన దానికన్నా భారీగా రెపో రేటు తగ్గించి అందరిని (Loans EMI) ఆశ్యర్యంలో ముంచేసింది. ముఖ్యంగా రుణగ్రహీతలకు భారీ ఉపశమనాన్ని అందించింది.

అసలు ఎవరూ ఊహించిన దానికన్నా ఎక్కువగా 50 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన రుణగ్రహీతల్లో మరింత ఉత్సాహాన్ని అందించింది.

Read Also : RBI గుడ్ న్యూస్.. భారీగా రెపో రేట్ కట్.. తగ్గనున్న ఈఎంఐ భారం.. ఇంకా..

ఒకవేళ బ్యాంకులు పూర్తి స్థాయిలో వడ్డీ రేట్లను తగ్గిస్తే.. రుణగ్రహీతలు తీసుకున్న హోం, ఆటో లోన్లపై ఈఎంఐలు కూడా భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 6శాతం నుంచి 5.5శాతం వద్ద ఉంది. ఫిబ్రవరి విధాన సమీక్ష తర్వాత ఆర్బీఐ రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.

భారీగా తగ్గనున్న లోన్లపై వడ్డీ రేట్లు :
రెపో రేటు తగ్గింపు (Loans EMI) ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సెంట్రల్ బ్యాంకుకు పరిమితంగానే మద్దతు ఇవ్వగలదని స్పష్టం చేశారు.

ద్రవ్య విధాన వైఖరిని తటస్థంగా మార్చినట్టు తెలిపారు. బ్యాంకులకు రుణాలు ఇచ్చే రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు అందించే రుణాలు సైతం భారీగా తగ్గనున్నాయి.

“ధరల స్థిరత్వంతో కొనుగోలు పెరుగుతాయి. గృహాలకు, వ్యాపారాలకు పొదుపుతో పాటు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. వడ్డీ రేటు కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా ఆర్థిక వృద్ధిని మరింతగా ప్రోత్సహిస్తాయి” అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో భారత జీడీపీ 7.4శాతం వృద్ధి చెందింది. ఇదే సమయంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సైతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా సుంకాల నుంచి సాపేక్షంగా సురక్షితంగా ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : RBI Repo Rate : సామాన్యులకు పండగే.. హోం, కార్ల లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి.. ఈఎంఐలు దిగొస్తాయి..!

ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలు జూలై 9 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతకన్నా ముందు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం మొదటి దశ ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.