RBI గుడ్ న్యూస్.. భారీగా రెపో రేట్ కట్.. తగ్గనున్న ఈఎంఐ భారం.. ఇంకా..
RBI MPC Review : ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో రెపో రేటు 5.50శాతానికి చేరింది. ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి.

RBI MPC Review
RBI MPC Review : రుణగ్రహీతలకు బిగ్ రిలీఫ్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును భారీగా తగ్గించింది. ముచ్చటగా మూడోసారి రెపో రేటును ఊహించినదాని కన్నా తగ్గించి అందరిని ఆశ్చర్యపరించింది. రెపో రేటు తగ్గింపుతో లోన్లపై ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి.
రెపో రేటును ఈసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దాంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. ద్రవ్య విధాన కమిటీ (MPC) పాలసీ రేటును తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
జూన్ 4 నుంచి 6 తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో పాలసీ రెపో రేటును ఆర్బీఐ నిర్ణయించింది.
అలాగే స్థూల-ఆర్థిక, ఆర్థిక పరిణామాలను అంచనా వేసింది. ఎంపీసీ పాలసీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించిందని గవర్నర్ మల్హోత్రా అన్నారు.
గత ఏప్రిల్‌లో ఆర్బీఐ 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC) 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపును ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం మధ్య ఎంపీసీ మే 2020 తర్వాత మొదటి రేటు తగ్గింపును ప్రకటించింది.
ఫిబ్రవరి 2025 నుంచి ఆర్బీఐ పాలసీ రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ ఈసారి తటస్థంగా ఉంచాలని నిర్ణయించింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితికి కూడా స్థూల ఆర్థిక దృక్పథాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు అంచనా వేయడం అత్యంత అవసరమని మల్హోత్రా పేర్కొన్నారు.
Read Also : Vivo V50 Elite Edition Review : అద్భుతమైన ఫీచర్లతో వివో V50 ఎలైట్ ఎడిషన్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?
రెపో రేటు అంటే.. వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ రుణాలు ఇచ్చే రేటు. ఈ రెపో రేటు తగ్గింపుతో గృహ రుణం, వ్యక్తిగత రుణాలు, కారు రుణాల ఈఎంఐలు తగ్గుతాయి. రుణగ్రహీతలకు డబ్బు ఆదాతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా ప్రయోజనం కలుగుతుంది.