Vivo V50 Elite Edition Review : అద్భుతమైన ఫీచర్లతో వివో V50 ఎలైట్ ఎడిషన్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?
Vivo V50 Elite Edition Review : వివో లవర్స్ ఇది మీకోసమే.. కొత్త V50 ఎలైట్ ఎడిషన్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఓసారి ఈ రివ్యూ చదవండి..

Vivo V50 Elite Edition Review
Vivo V50 Elite Edition Review : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో గత నెలలో Vivo V50 ఎలైట్ ఎడిషన్ లాంచ్ అయింది.
ఈ వివో V-సిరీస్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇతర (Vivo V50 Elite Edition Review) పార్టనర్ స్టోర్లలో రూ. 41,999కి అందుబాటులో ఉంది. అయితే, ఈ ఎలైట్ ఎడిషన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Read Also : Vivo V30 Pro 5G : వివో క్రేజే వేరబ్బా.. వివో V30 ప్రో 5Gపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!
0.757 సెం.మీ మందంతో ఉంటుంది. స్పెషల్ బ్లూవోల్ట్ సిస్టమ్ కలిగి ఉంది. 90W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీకి సపోర్టు అందిస్తుంది. అయితే, ఈ వివో ఎడిషన్ ఫీచర్లు, ధర వివరాలకు సంబంధించి ఫుల్ రివ్యూ ఓసారి లుక్కేయండి.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్ ఉంది. గరిష్ట ప్రకాశం 4,500 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ వివో ఫోన్ 50MP ZEISS ఆల్-మెయిన్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఇందులో గ్రూప్ సెల్ఫీ, OIS, అల్ట్రా-వైడ్ ఇమేజింగ్ ఫీచర్లు ఉన్నాయి. 23mm, 35mm, 50mm ZEISS మల్టీఫోకల్ పోర్ట్రెయిచర్‌తో సహా 7 ZEISS-స్టయిల్ పోర్ట్రెయిట్ ఫిల్టర్‌లకు సపోర్టు ఇస్తుంది.
డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ :
వివో V50 ఎలైట్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ మరింత పవర్ అందిస్తుంది. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 3 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్ అందిస్తుంది.
సిగ్నల్ పర్ఫార్మెన్స్ 45శాతం :
సర్కిల్ టు సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఫోటో ఎడిటింగ్ ఏఐ ఎరేజర్ 2.0 వంటి ఏఐ టూల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, 45శాతం వరకు హై సిగ్నల్ పర్ఫార్మెన్స్ అందించే ఏఐ సూపర్‌లింక్ కనెక్టివిటీని కలిగి ఉంది.
42 గంటల బ్యాటరీ లైఫ్ :
వివో V50 ఎలైట్ ఎడిషన్ డార్క్ ఇండిగోలో వివో TWS 3e ఇయర్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. గేమింగ్, స్ట్రీమింగ్ కోసం లో-లేటెన్సీ ఆడియోను, 42 గంటల బ్యాటరీ లైఫ్, 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి. వివో V50 ఎలైట్ ఎడిషన్‌లో సింగిల్ రోజ్ రెడ్ వెర్షన్ ఉంది. 512GB స్టోరేజీ, 12GB ర్యామ్ కలిగి ఉంది.
ఎవరికి బెస్ట్? :
వివో V50 ఎలైట్ ఎడిషన్ ఫోన్ పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే క్లారిటీ పరంగా అంతగా బాగుండదు. కానీ, బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే స్మూత్‌నెస్, స్టోరేజీ పరంగా అద్భుతమైనది.
రూ. 41,999 ధర వద్ద స్పీడ్ లేదా కెమెరా సామర్థ్యం కన్నా బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. సాధారణ మొబైల్ యూజర్లకు ఈ ఫోన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.