Motorola Edge 60 Review : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా? ఫుల్ రివ్యూ మీకోసం..!

Motorola Edge 60 Review : మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ ఎలా కొనుగోలు చేయాలంటే?

Motorola Edge 60 Review : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా? ఫుల్ రివ్యూ మీకోసం..!

Motorola Edge 60 Review

Updated On : June 6, 2025 / 11:28 AM IST

Motorola Edge 60 Review : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే ఫోన్.. మోటోరోలా ఎడ్జ్ 60 అద్భుతమైన (Motorola Edge 60 Review) ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. లైట్ వెయిట్ మాత్రమే కాదు.. కొంచెం సన్నగా మధ్యస్థంగా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v15పై రన్ అవుతుంది.

Read Also : Oppo Reno 12 Price : సూపర్ డిస్కౌంట్ బాస్.. ఇలా కొంటే అతి చౌకైన ధరకే ఒప్పో రెనో 12 మీ సొంతం..!

ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన డిజైన్, లుక్స్ మరింత అట్రాక్టివ్‌గా ఉంటుంది. మొబైల్ మార్కెట్లో ఇతర బ్రాండ్ల ఫోన్లకు దీటుగా మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ కూడా అంతే రేంజ్‌లో ఫీచర్లను అందిస్తుంది. ఇంతకీ ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ కొనొచ్చా లేదా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రీమియం డిజైన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ 7.9mm మందం, 179గ్రాముల బరువుతో వస్తుంది. ఈ ఫోన్ పట్టుకుంటే సన్నగా అరచేతిలో తేలికగా అనిపిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా కలిగి ఉంది. డిజైన్ ప్రీమియం, పోర్టబిలిటీ ఇష్టపడే యూజర్లకు బెస్ట్ ఫోన్.

HDR10+ సపోర్ట్‌తో OLED డిస్‌ప్లే :
ఈ మోటోరోలా ఫోన్ 6.7-అంగుళాల OLED స్క్రీన్‌, 1220 x 2712 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. 446ppi పిక్సెల్ సాంద్రత, మిడ్-టైర్ HDR10+ సపోర్ట్, పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. కంటెంట్ కోసం గేమింగ్‌కు స్క్రీన్ తగినట్టుగా ఉంది.

కెమెరా సెటప్ :
మోటోరోలా ఎడ్జ్ 60 బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP మెయిన్, 50MP అల్ట్రా-వైడ్, OIS సపోర్టుతో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. 30fps వద్ద హై క్వాలిటీ 4K వీడియో రికార్డింగ్, హై రిజుల్యుషన్ 50MP ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్, ఫొటోగ్రఫీకి బెస్ట్ ఫోన్.

ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ :
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌తో పాటు ఆక్టా-కోర్ 2.5GHz ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ కలిగి ఉంది. అదనంగా 8GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.

ఈ సెటప్ రోజువారీ మల్టీ టాస్కింగ్‌కు బెస్ట్. స్నాప్‌డ్రాగన్ ఫోన్లతో పోలిస్తే.. గేమ్స్ ఆడటం లేదా భారీ ప్రాసెసింగ్ సమయంలో పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండవచ్చు.

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ :
5500mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ గంటలు వినియోగించుకోవచ్చు. లాంగ్ స్ట్రీమింగ్, బ్రౌజింగ్ లేదా వీడియో కాల్స్ చేసే యూజర్లకు సరైన ఫోన్.

పాజిటివ్ పాయింట్స్ :

  • లైట్ వెయిట్, స్లిమ్ బిల్ట్
  • HDR10+ OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్
  • OISతో హై-రిజల్యూషన్ కెమెరా మాడ్యూల్
  • బాక్స్‌లో ఆండ్రాయిడ్ v15
  • 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ

నెగిటివ్ పాయింట్స్ :

  • 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లేదు
  • FM రేడియో సపోర్టు లేదు
  • చిప్‌సెట్ పర్ఫార్మెన్స్ నార్మల్
  • డిస్‌ప్లే పిక్సెల్ డెన్సిటీ పర్వాలేదు
  • ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు లో-లైటింగ్‌లో యావరేజ్ షాట్స్

Read Also : Vivo V30 Pro 5G : వివో క్రేజే వేరబ్బా.. వివో V30 ప్రో 5Gపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

ఫైనల్‌గా ఫోన్ కొనొచ్చా? :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ డిజైన్, కెమెరా హార్డ్‌వేర్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఆల్‌రౌండ్ ఫీచర్లను కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ కన్నా లుక్, బ్యాటరీ లైఫ్‌ కోరుకునేవారికి బెస్ట్ ఫోన్. గేమర్‌లకు అంతగా సపోర్టు చేయదు. కానీ, రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.