Vivo V30 Pro 5G : వివో క్రేజే వేరబ్బా.. వివో V30 ప్రో 5Gపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!
Vivo V30 Pro 5G : వివో ఫోన్ అతి తక్కువ ధరకే లభ్యమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V30 ప్రో 5Gపై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది.

Vivo V30 Pro 5G
Vivo V30 Pro 5G : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. అతి చౌకైన ధరకే వివో V30 ప్రో 5G ఫోన్ లభిస్తోంది. 50MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. వివో V30 ప్రో 5G ఫోన్ (Vivo V30 Pro 5G) అద్భుతమైన కెమెరాలను కలిగి ఉంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ఈ 5G ఫోన్‌లో స్టూడియో-క్యాలిబర్ ఆరా లైట్, ZEISS ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.
భారత మార్కెట్లో వివో V30 ప్రో 5G అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ కేవలం 0.745 సెం.మీ మందంతో వస్తుంది. మీడియాటెక్ సీపీయూను కలిగి ఉంది.
వర్చువల్ ర్యామ్ కూడా సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
బ్యాంకు కార్డులతో బిగ్ డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V30 ప్రో 5G ఫోన్ 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ మోడల్ రూ.46,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డులతో రూ.6,500 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వివో ఫోన్ మొత్తం ధర రూ.34,990 అవుతుంది. కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపు కూడా పొందవచ్చు.
పాత ఫోన్‌పై రూ.40వేల వరకు తగ్గింపుతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. కొన్ని మోడళ్లు రూ.4వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ క్లాసిక్ బ్లాక్, అండమాన్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వివో V30 ప్రో 5G ఫీచర్లు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ HDR10 ప్లస్‌తో కూడిన 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 8200 చిప్‌తో ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంది.
Read Also : Oppo Reno 12 Price : సూపర్ డిస్కౌంట్ బాస్.. ఇలా కొంటే అతి చౌకైన ధరకే ఒప్పో రెనో 12 మీ సొంతం..!
ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా, బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ, టెలిఫోటో, అల్ట్రావైడ్ సెన్సార్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫన్‌టచ్OS 14తో రన్ అయ్యే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు.