FASTag bank
FASTag bank : హైవేలపై వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే డబుల్ టోల్ చెల్లించాలి. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది ఒక బ్యాంకు నుంచి FASTag అకౌంట్ తొలగించి మరో బ్యాంకు నుంచి కొత్త FASTag తీసుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఫాస్ట్ ట్యాగ్ బ్యాంకు ఎలా మార్చుకోవాలో చాలామంది వాహనదారులకు అవగాహన ఉండదు.
వాస్తవానికి, ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏ బ్యాంకు జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్ తీసుకుంటారో దానికే కనెక్ట్ అయి ఉంటుంది. ముందుగా ఈ పాత బ్యాంకు లింక్ తొలగించాలి. ఆ తర్వాతే కొత్తది తీసుకోవాలి. ఈ ఫుల్ ప్రాసెస్ ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ రెండింటిలోనూ చేయొచ్చు. ఫాస్ట్ ట్యాగ్ బ్యాంకు ఎలా మార్చాలి? ఎంత సమయం పడుతుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
FASTag అంటే ఏంటి? :
2021 నుంచి భారత్‌లో ఫోర్ వీల్స్ వెహికల్స్ కోసం FASTag తప్పనిసరి అయింది. హైవే టోల్ ప్లాజాలలో నాన్-స్టాప్ పేమెంట్ కోసం RFID టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. బ్యాంక్ జారీ చేసిన వ్యాలెట్‌కు కనెక్ట్ అయి ఉంటుంది.
ఫాస్ట్ ట్యాగ్ బ్యాంక్‌ను ఎలా మార్చాలి? :
NPCI వన్ వెహికల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్ పాలసీ ప్రకారం.. మీకు ఇప్పటికే ఒకే ఒక యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే.. మీరు నేరుగా ఏదైనా ఇతర బ్యాంకు నుంచి కొత్త ఫాస్ట్‌ట్యాగ్ పొందవచ్చు.
ఆన్‌లైన్ FASTag ఇలా :
1. మీరు కొత్త FASTag కోసం బ్యాంక్ వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ఓపెన్ చేయండి.
2. FASTag సెక్షనకు వెళ్లి Apply for FASTag లేదా Buy FASTag ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. మీ వెహికల్ నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వివరాలను ఎంటర్ చేయండి.
4. అడ్రస్ కన్ఫార్మ్ చేసి పేమెంట్ చేయండి.
5. కొత్త FASTag 3 నుంచి 4 రోజుల్లో మీ ఇంటికి వస్తుంది.
6. RC, వెహికల్ ఫొటో, సైడ్ ఫోటో, FASTag ఫోటోను అప్‌లోడ్ చేయండి.
7. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన 4 గంటల్లోపు FASTag యాక్టివేట్ అవుతుంది.
ఆఫ్‌లైన్‌లో ఇలా :
1. బ్యాంక్ బ్రాంచ్ లేదా FASTag ఏజెంట్‌ను సంప్రదించండి.
2. ఏజెంట్ మీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి వెరిఫికేషన్ లింక్‌ను పంపుతారు.
3. ఆ లింక్ ఓపెన్ చేసి OTP ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ వివరాలను చెక్ చేసి పేమెంట్ చేయండి.
4. FASTag అక్కడే యాక్టివేట్ అవుతుంది.
ఆన్‌లైన్ FASTag 3-4 రోజుల్లో వస్తుంది. వెరిఫికేషన్ అయిన 4 గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే, ఆఫ్‌లైన్ FASTag రియల్ టైమ్‌లో యాక్టివేట్ అవుతుంది.