Google Pixel 9 Pro : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఆఫర్లు.. పిక్సెల్ 9 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. AI ఫీచర్లు అదుర్స్.. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..!
Google Pixel 9 Pro : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఈరోజే లాస్ట్.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..

Google Pixel 9 Pro
Google Pixel 9 Pro : కొత్త పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఈరోజు (జూలై 17)తో ముగియనుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ కెమెరా సెటప్, ఆర్టిఫిషియల్ (Google Pixel 9 Pro) ఇంటెలిజెన్స్ ఫీచర్లు కలిగిన ఫోన్ కావాలంటే ఇదే సరైన సమయం. ఈ సేల్ సమయంలో పిక్సెల్ 9 ప్రో ధర తక్కువ ధరకే లభ్యమవుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ రూ. 23వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. క్లట్టర్-ఫ్రీ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఏఐ ఫీచర్లతో స్క్రీన్‌షాట్స్ యాప్, పిక్సెల్ స్టూడియో, జెమిని లైవ్, యాడ్ మీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ డీల్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర రూ.1,09,999కు లాంచ్ అయింది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ.89,999కు అందుబాటులో ఉంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.3వేల అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ.4 వేల వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కొనుగోలుదారులు పాత ఫోన్ రూ. 83,300 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఫైనల్ వాల్యూ మోడల్, ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల (LTPO) డిస్‌ప్లే, 3,000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 లేయర్ కలిగి ఉంది. హుడ్ కింద గూగుల్ పిక్సెల్ 9 ప్రో టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. ఇంకా, పిక్సెల్ ఫోన్ 4,700mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.