PF Balance
PF Balance : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల కోసం కొత్త అప్‌డేట్ ప్రవేశపెట్టింది. కీలక సేవలకు డిజిటల్ యాక్సెస్‌ను మరింత విస్తరించింది. ఈపీఎఫ్ఓ సభ్యులు ఇకపై తమ పీఎఫ్ సంబంధిత డాక్యుమెంట్లను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు.. బ్యాలెన్స్‌ను నేరుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని (DigiLocker) యాప్ ద్వారా చెక్ చేయవచ్చు అని ప్రకటించింది.
ఈ కొత్త అప్‌డేట్ వినియోగదారులు (PF Balance) డీజీలాకర్ ద్వారా యూఎఎన్ కార్డ్, పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO) స్కీమ్ సర్టిఫికేట్ వంటి ముఖ్యమైన ఈపీఎఫ్ఓ డాక్యుమెంట్లను వీక్షించడమే కాకుండా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో, పీఎఫ్ పాస్‌బుక్‌ను చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం UMANG యాప్ ద్వారా అందుబాటులో ఉండేది. ఆ సర్వీసు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, డీజీలాకర్ ఇంటిగ్రేట్ చేయడంతో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు.
డిజిలాకర్‌లో EPF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? :
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? :
SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? :
ముందుగా, మీ మొబైల్ నంబర్ మీ UANతో రిజిస్టర్ అయి ఉండాలి. వినియోగదారులు “EPFOHO UAN” ఫార్మాట్‌లో 7738299899కు SMS పంపవచ్చు. మీ లేటెస్ట్ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన SMS మీకు అందుతుంది.
మీరు మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. అయితే, మీ మొబైల్ నంబర్ UAN, ఆధార్, PAN, బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో నిర్ధారించుకోండి. ఆ తర్వాత 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ పీఎఫ్ అకౌంట్ వివరాలతో త్వరలో SMS వస్తుంది.