Custom UPI ID
Custom UPI ID : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ పే, పేటీఎం లేదా ఫోన్‌పే ఏదైనా సరే.. యూపీఐ పేమెంట్ల విషయంలో మరింత ప్రైవసీని పొందవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల కోసం చెల్లిస్తున్నా లేదా లోకల్ షాపు నుంచి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేస్తున్నా యూపీఐ పేమెంట్లు చేస్తుంటారు.
ప్రస్తుతం యూపీఐ పేమెంట్లకు (Custom UPI ID) ఫుల్ డిమాండ్ పెరిగింది. యూపీఐ పేమెంట్లతో స్కాములు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ స్కామర్‌లు యూపీఐ ఐడీల నుంచి బాధితుల పేరు, ఇతర వివరాలతో డబ్బును దొంగిలిస్తారు. ఇప్పటికే చాలామంది యూపీఐ యూజర్లు స్కామర్ల బారినపడి భారీ మొత్తంలో డబ్బును కోల్పోయారు.
అందుకే ఇలాంటి మోసాలను అరికట్టేందుకు గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ యూపీఐ ఐడీ కోసం కస్టమైజడ్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టాయి. ఈ ఫీచర్ ద్వారా యూపీఐ ఐడీ నుంచి మీ పేరు లేదా ఫోన్ నంబర్‌ను సులభంగా డిలీట్ చేయొచ్చు. ఇందుకోసం అనధికారిక పేరు లేదా నిక్ నేమ్ ఉపయోగించవచ్చు.
చాలా మంది కస్టమర్లు పేమెంట్లు చేసేటప్పుడు వ్యక్తిగత వివరాలతో తమ ఐడీని హైడ్ చేయాలని భావిస్తారు. అధికారిక ఐడీ లేదా ఫోన్ నంబర్ అందరికి కనిపించేలా ఉండటం అసలు ఇష్టపడరు. దాంతో ప్రైవసీ పరంగా ఈ ఫీచర్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మీరు కూడా యూపీఐ ఐడీని కస్టమైజ్ చేయాలనుకుంటున్నారా? ఈ కింది విధంగా ఓసారి ట్రై చేయండి.
పేటీఎంలో UPI ID ఎలా కస్టమైజ్ చేయాలి? :
మీ ఫోన్‌లో పేటీఎం అప్లికేషన్‌ను ఓపెన్ చేసి ఆపై టాప్-లెఫ్ట్ కార్నర్‌లో ప్రొఫైల్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
ఇప్పుడు, యూపీఐ, పేమెంట్ సెట్టింగ్‌లకు కిందికి స్క్రోల్ చేయండి.
మీరు టాప్ కార్నర్‌లో ప్రస్తుత UPI IDతో పాటు UPI అకౌంట్, ID వివరాలను చూడొచ్చు.
మీరు UPI IDపై ట్యాప్ చేశాక నెక్స్ట్ స్క్రీన్‌కు రీడైరెక్ట్ అవుతారు. మీరు కొత్త యూపీఐ ఐడీని మార్చవచ్చు.
ఆపై సేవ్ చేయండి.
Note : గూగుల్ పే, ఫోన్ పే ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది. మీ ప్రొఫైల్‌పై ట్యాప్ చేయండి. బ్యాంక్ అకౌంటుపై ట్యాప్ చేయండి. ఆపై UPI ID కోసం సెర్చ్ చేయండి. మీ ప్రాధాన్యత ప్రకారం యూపీఐ ఐడీని మార్చవచ్చు.