Apple Diwali Sale 2025 : ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 17, మ్యాక్‌బుక్స్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్
Apple Diwali Sale 2025 : దీపావళికి ముందుగానే ఆపిల్ పండుగ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్ 17 సిరీస్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్స్, ఎయిర్ ప్యాడ్స్, ఆపిల్ వాచ్ వంటి వివిధ ప్రొడక్టులపై రూ. 10వేల వరకు తగ్గింపును అందిస్తోంది.

Apple Diwali Sale 2025
Apple Diwali Sale 2025 : దీపావళి పండగ వచ్చేస్తోంది. పండగకు దాదాపు నెలకన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది. ఇంతలోనే ఆపిల్ భారతీయ కస్టమర్ల కోసం అద్భుతమైన పండుగ ఆఫర్లను ప్రకటించింది.
టెక్ దిగ్గజం ఈ ఏడాదిలో ఐఫోన్ 17 సిరీస్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ వాచ్‌లతో (Apple Diwali Sale 2025) సహా అత్యంత పాపులర్ ప్రొడక్టులపై రూ. 10వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్స్‌లో ఎక్కువగా ఆపిల్ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో అందిస్తోంది. ఈ ఆపిల్ దీపావళి సేల్ డీల్స్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్లపై డిస్కౌంట్లు :
ఐఫోన్ల విషయానికి వస్తే.. ఆపిల్ ఇండియా (apple.in) వెబ్‌సైట్ ద్వారా ఐఫోన్ 17 సిరీస్‌పై రూ.5వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. స్టాండర్డ్ ఐఫోన్ 17 (రూ.82,900) రూ.77,900కి తగ్గింది. మరోసారి, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.6వేలు తగ్గింపుతో అద్భుతమైన డీల్స్ అందిస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లపై కూడా రూ.4వేలు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. అయితే, ఇతర రిటైలర్లు బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అద్భుతమైన డీల్స్ పొందవచ్చు.
మ్యాక్‌బుక్‌లపై భారీ సేవింగ్స్ :
ఆపిల్ అధికారిక స్టోర్ మాక్‌బుక్ ఎయిర్ M4 మోడళ్లపై రూ. 10వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. రూ. 99,900 ధరకు లాంచ్ అయిన 13-అంగుళాల వేరియంట్ ఇప్పుడు ఐసీఐసీఐ, యాక్సిస్ లేదా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులతో రూ. 89,900 ధరకు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, M4 చిప్‌తో 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో లాంచ్ ధర రూ. 1,69,900 నుంచి రూ. 1,59,900కి తగ్గగా, 16-అంగుళాల M4 ప్రో మ్యాక్‌బుక్ ప్రో అదే బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ. 2,49,900 నుంచి రూ. 2,39,900కి తగ్గింది.
ఆపిల్ అందించే ఆఫర్ కన్నా విజయ్ సేల్స్ అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. రిటైలర్ ఎలాంటి షరతులు లేకుండా బేస్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 (16GB + 256GB)ను రూ. 89,990కు విక్రయిస్తోంది. అదనంగా రూ. 10వేల బ్యాంక్ డిస్కౌంట్ (SBI, ICICI) కార్డులతో పేమెంట్ చేయొచ్చు. తద్వారా ఆపిల్ డివైజ్ కేవలం రూ. 79,990కు పొందవచ్చు. అంటే మొత్తం రూ. 20వేలు సేవ్ చేసుకోవచ్చు.
ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లు, ఐప్యాడ్‌లు :
ఆపిల్ వాచ్ సిరీస్ 11పై రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఆపిల్ వాచ్ SE 3పై రూ.2వేలు తగ్గింపు అందిస్తుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో 3, ఎయిర్‌పాడ్స్ 4లపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందవచ్చు. ఐప్యాడ్ విషయానికి వస్తే.. లేటెస్ట్ ఐప్యాడ్ ఎయిర్ (11-అంగుళాలు, 13-అంగుళాలు)పై రూ.4వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. సాధారణ ఐప్యాడ్ మాదిరిగానే ఐప్యాడ్ మినీపై రూ.3వేలు ధర తగ్గింపు పొందింది.