Vivo V60e 5G : వివో లవర్స్ మీకోసమే.. కొత్త వివో V60e 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V60e 5G : కొత్త వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత్‌కు వివో V60e 5G ఫోన్ రాబోతుంది. ఈ లాంచ్ డేట్, ధర, స్పెషిఫికేషన్ల వివరాలపై భారీ అంచనాలివే..

Vivo V60e 5G : వివో లవర్స్ మీకోసమే.. కొత్త వివో V60e 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V60e 5G Leaks

Updated On : September 30, 2025 / 1:52 PM IST

Vivo V60e 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి కొత్త వివో V60e 5G ఫోన్ వచ్చేస్తోంది. పాపులర్ V-సిరీస్ లైనప్‌ను మరింత విస్తరించేందుకు వివో సన్నాహాలు చేస్తోంది. ఇతర ప్రీమియం ఫోన్ల మాదిరిగా కాకుండా ఈసారి రాబోయే మోడల్ మరింత సరసమైన ధరకు లభించనుందని భావిస్తున్నారు. మిడ్ రేంజ్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఫ్లిప్‌కార్ట్ కూడా వివో V60e ఫోన్ ధర, వేరియంట్‌లపై క్లారిటీ ఇచ్చింది. అయితే, అంతలోనే (Vivo V60e 5G) ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఆయా వివరాలను ప్లాట్‌ఫారం నుంచి తొలగించింది. ఇటీవలే వివో V60e 5G ఫోన్ ధర స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ లిస్టు స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. రాబోయే వివో V60e 5G ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో V60e 5G భారత్ లాంచ్ టైమ్‌లైన్ :
వివో కంపెనీ ఇంకా అధికారికంగా తేదీని ప్రకటించలేదు. కానీ, లీకుల ప్రకారం.. వివో V60e 5G ఫోన్ వచ్చే అక్టోబర్ 7న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Samsung Galaxy A55 5G : అమెజాన్‌లో బ్రహ్మాండమైన ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

భారత్‌లో వివో V60e 5G ధర (అంచనా) :
లీక్ ప్రకారం.. ఈ వివో ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో రావచ్చు. 8GB + 128GB ధర రూ. 28,749, 8GB + 256GB ధర రూ. 30,749, 12GB + 256GB ధర రూ. 32,749కు పొందవచ్చు. రాబోయే వివో V60e 5G మిడ్-రేంజ్ ఆఫర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఇతర వివో V-సిరీస్ మోడళ్ల కన్నా కొంచెం చౌకగానే ఉంటుంది. వివో కొత్త V60e ఫోన్ ధర ఎంత అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

వివో V60e 5G స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో V60e ఫోన్ 200MP ప్రైమరీ కెమెరా, జూమింగ్ కోసం 85mm టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. కొత్త వివో ఫోన్ IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుందని భావిస్తున్నారు. రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పాటు 12GB వరకు ర్యామ్ కలిగి ఉండొచ్చు.

ఫ్రంట్ సైడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పవర్‌ఫుల్ OLED ప్యానెల్‌ అందించనుంది. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6500mAh బ్యాటరీ ఉండవచ్చు. ఇతర ఫోన్లలో కన్నా బెటర్ ఫీచర్లు ఉండొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో రానుంది.