Aadhaar Card
Aadhaar Card : ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి భారతీయుడికి ఆధార్ అత్యంత కీలకమైన ఐడెంటిటీ డాక్యుమెంట్లలో ఒకటిగా మారింది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి మొబైల్ సిమ్ పొందడం వరకు ప్రతిదానికీ ఆధార్ కార్డు తప్పనిసరి.
ఆధార్ వినియోగం పెరగడంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇప్పుడు వాట్సాప్‌లో కూడా నేరుగా ఆధార్‌ను యాక్సెస్ చేసేందుకు అనుమతినిస్తుంది. ఇందుకోసం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ సౌకర్యం వాట్సాప్‌లోని ప్రభుత్వ అధికారిక MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌లో మెర్జ్ అయింది. ఇప్పుడు వినియోగదారులు తమ ఆధార్ పాస్‌వర్డ్-ప్రొటెక్షన్ డిజిటల్ కాపీని సురక్షితంగా డౌన్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ డిజిలాకర్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. డిజిటల్ ఆధార్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటుంది. కేవలం ఆధార్ సంబంధిత యూజర్ మాత్రమే యాక్సెస్ చేయగలరు.
వాట్సాప్ నుంచి ఇలా రిజిస్టర్ చేసుకోండి.
వాట్సాప్ నుంచి ఆధార్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? :
ఒకేసారి ఒక డాక్యుమెంట్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ డిజిలాకర్ అకౌంటులో ఇప్పటికే అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లు లింక్ చేయకపోతే.. వినియోగదారులు వాట్సాప్ సర్వీసును ఉపయోగించే ముందు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ డిజిలాకర్ అకౌంట్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.