iOS 26 Update : ఐఫోన్ లవర్స్‌ కోసం iOS 26 అప్‌డేట్.. పాత ఐఫోన్లకు సపోర్టు.. ఎలా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలంటే?

iOS 26 Update : iOS 26 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇప్పుడు పాత ఐఫోన్లకు కూడా అందుబాటులో ఉంది. ఈ అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసి ఇలా ఇన్‌స్టాల్ చేయండి.

iOS 26 Update : ఐఫోన్ లవర్స్‌ కోసం iOS 26 అప్‌డేట్.. పాత ఐఫోన్లకు సపోర్టు.. ఎలా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలంటే?

iOS 26 is now available for older iPhones

Updated On : September 16, 2025 / 1:56 PM IST

iOS 26 Update : ఆపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆపిల్ కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26 వచ్చేసింది. పాత ఐఫోన్‌ల ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 9న జరిగిన ఆపిల్ ఈవెంట్ సందర్భంగా కంపెనీ iOS 26 లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ కొత్త అప్‌డేట్ డిజైన్, ఫీచర్లలో భారీ అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది.

ఆపిల్ కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26లో మెయిన్ (iOS 26 Update) డిజైన్ ప్రవేశపెట్టింది. బీటా వెర్షన్ యూజర్లు ఇప్పటికే “లిక్విడ్ గ్లాస్” డిజైన్‌ యాక్సస్ చేస్తున్నారు. VisionOS ఇంటర్‌ఫేస్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త యూఐలో మెనూలు, నోటిఫికేషన్‌లు, కంట్రోల్ సెంటర్‌తో సహా OS ఆపరేటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది.

లాక్ స్క్రీన్ నుంచి హోమ్ విడ్జెట్‌ల వరకు iOS 26 లేటెస్ట్ డిజైన్‌ కలిగి ఉంది. లాక్ స్క్రీన్ వాల్‌పేపర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంటుంది. యాప్ ఐకాన్స్ ట్రాన్స్ పరెంట్ కనిపిస్తాయి. వ్యూజువల్‌గా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Read Also : Top 5 Best 5G Smartphones : రూ.15వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. ఇలాంటి ఫోన్లు మళ్లీ దొరకవు!

iOS 26 ఎలా డౌన్‌లోడ్ చేయాలి? :
iOS 26ని డౌన్‌లోడ్ చేసేందుకు మీకు 5G లేదా Wi-Fi బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ వంటి స్పీడ్, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. అప్‌డేట్ చేశాక టెక్నికల్ బగ్ ఇష్యూ రావొచ్చు. ముందుజాగ్రత్త చర్యగా మీ వ్యక్తిగత డేటాను బ్యాకప్ పెట్టుకోండి.

iOS 26 ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే? :

  • మీ ఐఫోన్ సెట్టింగ్స్ యాప్‌కి వెళ్లండి.
  • మీ ప్రొఫైల్ కింద అప్‌డేట్ నోటిఫికేషన్ చెక్ చేయండి.
  • లేకపోతే, General ఆప్షన్ క్లిక్ చేయండి.
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై ట్యాప్ చేయండి.
  • మీ ఐఫోన్ కొత్త iOS 26 అప్‌డేట్ కోసం చెక్ చేస్తుంది.
  • ఆ తర్వాత డౌన్‌లోడ్ చేసి Install Now ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • డౌన్‌లోడ్ పూర్తైన తర్వాత Update ఇన్‌స్టాల్ చేసి మీ ఫోన్‌ను Reboot చేయండి.
  • మీ ఐఫోన్ ఇప్పుడు కొత్త iOS 26 వెర్షన్‌లో రన్ అవుతుంది.

ఏ ఐఫోన్‌లు iOS 26కి సపోర్టు చేస్తాయంటే? :
మొత్తం 26 ఐఫోన్ మోడళ్లకు iOS 26 అందుబాటులో ఉంటుందని ఆపిల్ ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్ ఐఫోన్ 11 సిరీస్ (2019లో లాంచ్) అంతకంటే కొత్త ఐఫోన్ల నుంచి అన్ని ఐఫోన్‌లకు సపోర్టు చేస్తుంది.

iOS 26 అప్‌డేట్ సపోర్టు చేసే ఐఫోన్లు :

  • ఐఫోన్ 11
  • ఐఫోన్ 11 ప్రో
  • ఐఫోన్ 11 ప్రో మాక్స్
  • ఐఫోన్ SE (2వ జనరేషన్ ఆపై వెర్షన్ )
  • ఐఫోన్ 12
  • ఐఫోన్ 12 మినీ
  • ఐఫోన్ 12 ప్రో
  • ఐఫోన్ 12 ప్రో మాక్స్
  • ఐఫోన్ 13
  • ఐఫోన్ 13 మినీ
  • ఐఫోన్ 13 ప్రో
  • ఐఫోన్ 13 ప్రో మాక్స్
  • ఐఫోన్ 14
  • ఐఫోన్ 14 ప్లస్
  • ఐఫోన్ 14 ప్రో
  • ఐఫోన్ 14 ప్రో మాక్స్
  • ఐఫోన్ 15
  • ఐఫోన్ 15 ప్లస్
  • ఐఫోన్ 15 ప్రో
  • ఐఫోన్ 15 ప్రో మాక్స్
  • ఐఫోన్ 16
  • ఐఫోన్ 16 ప్లస్
  • ఐఫోన్ 16 ప్రో
  • ఐఫోన్ 16 ప్రో మాక్స్