Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ద్వారా రీల్స్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఇన్‌స్టా అకౌంట్లలో అప్‌లోడ్ చేసిన రీల్స్ డౌన్ లోడ్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో అధికారంగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?

How to download Instagram Reels, the official way

How to Download Instagram Reels : ప్రముఖ సోషల్ మీడియా షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ పబ్లిక్ అకౌంట్ల నుంచి రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్ మొదట జూలైలో అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందరికి ఈ ఇన్‌స్టా ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోని అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్‌ల నుంచి తమ రీల్స్‌ను ఎవరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చో కంట్రోల్ చేసే ఆప్షన్‌ను వినియోగదారులకు అందించింది.

Read Also : Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్‌డేట్.. మీ పోస్టులు క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ఒక క్రియేటర్ ఎవరైనా సరే తమ అకౌంట్ నుంచి రీల్ డౌన్‌లోడ్‌ చేసేందుకు అనుమతించినట్లయితే.. మీరు రీల్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో సేవ్ చేసుకోవచ్చు. మీరు పబ్లిక్ అకౌంట్ నుంచి రీల్‌లను డౌన్‌లోడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. అది ఎలా చేయాలి అనేదానిపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రీల్స్ డౌన్‌లోడ్‌పై ప్రైవసీ కంట్రోల్ ఆప్షన్ :
ముందుగా, పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి మాత్రమే రీల్స్ డౌన్‌లోడ్ చేయగలరని గమనించాలి. క్రియేటర్‌లు అకౌంట్ సెట్టింగ్స్ నుంచి తమ రీల్‌ల కోసం డౌన్‌లోడ్‌లను అనుమతించడానికి లేదా నిరోధించడానికి ఆప్షన్ కలిగి ఉంటారు. డౌన్‌లోడ్ చేసిన రీల్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ వాటర్‌మార్క్, యూజర్ నేమ్, ఆడియో అట్రిబ్యూషన్ ఉంటాయి. రీల్స్ డౌన్‌లోడ్‌లు వ్యక్తిగత ఉపయోగానికి మాత్రమే.. కమర్షియల్ వినియోగం కోసం కాదని గుర్తించాలి. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు డౌన్‌లోడ్ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆఫ్ చేసి ఉంటుంది.

How to download Instagram Reels 

మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో రీల్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఎనేబుల్ ఎలా? :
* రీల్‌ను రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం చేయొచ్చు.
* కింది కుడి భాగంలో ‘Next’ ట్యాప్ చేయండి.
* దిగువన ఉన్న ‘More Options’ నొక్కండి.
* కిందికి స్క్రోల్ చేసి, ‘Advanced Settings’ బటన్ నొక్కండి.
* మీ రీల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ‘వ్యక్తులను అనుమతించు’ అనే ఆప్షన్ కనుగొని, సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్‌ని టోగుల్ చేయండి.
* అన్ని రీల్‌ల కోసం డౌన్‌లోడ్ చేయడాన్ని ఎనేబుల్ చేయాలా? లేదా నిలిపివేయాలా లేదా మీరు అప్‌లోడ్ చేస్తున్న దాన్ని ఎంచుకోండి.
* బ్యాక్ వెళ్లేందుకు టాప్-లెఫ్ట్ యారో నొక్కండి.
* చివరగా, దిగువన ఉన్న ‘Share’ నొక్కండి.

పబ్లిక్ అకౌంట్ల నుంచి రీల్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా
ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి.. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న రీల్‌కు నావిగేట్ చేయండి.
* ‘Share’ ఐకాన్ నొక్కండి. ఆపై ‘Download’ ఆప్షన్ ఎంచుకోండి.
* రీల్ డౌన్‌లోడ్ అవుతుంది. డివైజ్ కెమెరా రోల్‌లో సేవ్ అవుతుంది.

Read Also : iQoo 11 5G Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐక్యూ 11 5జీపై అదిరే డిస్కౌంట్.. ఫ్రీగా వివో TWS ఇయర్‌బడ్స్ పొందొచ్చు!

ట్రెండింగ్ వార్తలు