Screen time: మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్లను వదలడం లేదా? ప్రమాదమే.. స్క్రీన్ టైమ్‌ను తగ్గించేలా చేసి ఎలా కాపాడుకోవాలో తెలుసా?
మీ పిల్లలకు మొబైళ్ల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది.
- T Venkateshwarlu
- Published On : February 12, 2025 / 01:38 PM IST
ప్రస్తుత కాలంలో పిల్లలు విపరీతంగా మొబైల్ వాడుతున్నారు. చిన్నారులు ఏడిస్తే పెద్దలు వారికి మొబైల్ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. పెద్దలు పనులు చేసుకుంటున్నప్పుడు చిన్నారులు గొడవ చేయకుండా బుద్ధిగా ఒకేచోట కూర్చోవడానికి కూడా వారికి మొబైల్‌ను అలవాటు చేస్తున్నారు. చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతుండడంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వారికి చుట్టుముడుతున్నాయి.
Also Read: పాపం పసివాళ్లు… అప్పుడు అమ్మ.. ఇప్పుడు నాన్న.. ఏడాదిలోనే ఇద్దర్నీ కోల్పోయి..
దీంతో పోలీసులు కూడా దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు పెట్టుకున్నారు. తాజాగా తెలంగాణలోని రాచకొండ పోలీసులు పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు అందించారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ చిట్కాలను పాటిస్తే ఎంతో మేలని చెప్పారు.
పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు పోలీసులు చేసిన కొన్ని సూచనలు
- పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు కొన్ని నిబంధనలు పాటించాలి
- పెద్దలు కూడా స్క్రీన్ వాడకాన్ని తగ్గిస్తే, పిల్లలకు కూడా అదే అలవాటు అబ్బుతుంది
- మైదానంలో ఆటలు, పుస్తకాల పఠనం, డ్రాయింగ్, సంగీతం, లేదా వృత్తి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను పిల్లల్లో ప్రోత్సహించండి
- పేరెంటల్ కంట్రోల్‌ను అమలు చేసి, ప్రమాదకరమైన కంటెంట్ నుంచి పిల్లలను రక్షించండి
- డిన్నర్ టైమ్ లేదా నైట్ టైమ్ మొబైళ్లను పక్కన పెట్టి, కుటుంబ సభ్యులతో మాట్లాడే సాంప్రదాయాన్ని ప్రోత్సహించండి
- మొబైల్ వాడకాన్ని తగ్గించినప్పుడు పిల్లలను అభినందించండి
- కేవలం ఆంక్షలు విధించకుండా, ఆచరణలో అమలు చేసే మార్గాలను సూచించండి
#TodaysThemePoster
పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు.
బహిరంగ ఆటలను ప్రోత్సహించండి మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.#TelanganaPolice #RachakondaPolice #TGPolice pic.twitter.com/6eNl17L73R— Rachakonda Police (@RachakondaCop) February 12, 2025
