Instagram Instants : బాబోయ్ మాకొద్దు.. ఇన్‌స్టాలో కొత్త ‘ఇన్‌స్టంట్స్’ఫీచర్ టెన్షన్ పెడుతోందా?.. ఈ సెట్టింగ్ మార్చితే చాలు..!

Instagram Instants Feature : ఇన్‌స్టాగ్రామ్ ‘ఇన్‌స్టంట్స్’కొత్త ఫీచర్‌ ట్రై చేశారా? మీ రియల్ టైమ్ ఒరిజినల్ ఫొటోలను ఈజీగా అప్పటికప్పుడే షేర్ చేయొచ్చు. కాసేపు అయ్యాక ఆ ఫొటోలు వాటంతట అవే అదృశ్యమవుతాయి. ఎలా పొందాలంటే?

Instagram Instants Feature ( Image Credit : AI )

  • ఇన్‌స్టాగ్రామ్ ‘ఇన్‌స్టంట్స్’కొత్త ఫీచర్‌ వచ్చేసింది
  • రియల్ టైమ్ ఒరిజినల్ ఫొటోలను ఈజీగా షేర్ చేయొచ్చు
  • యూజర్లు పంపిన ఫొటోలు కాసేపటికే అదృశ్యమవుతాయి
  • ఇప్పుడు ఈ ఫీచర్ మాకొద్దంటున్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు

Instagram Instants Feature : ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్ వచ్చేసింది. కానీ, కొద్ది రోజులకే ఈ ఫీచర్ యూజర్లకు విసుగు పుట్టించింది. ప్రపంచవ్యాప్తంగా ‘ఇన్‌స్టంట్స్’ అనే కొత్త ఫీచర్‌ ఇటీవలే కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇన్‌స్టంట్ ఒరిజినల్ ఫొటోలను షేర్ చేయొచ్చు అనమాట. మీరు పంపిన ఫొటోలు కొంత సమయం తర్వాత వాటంతట అవే అదృశ్యమవుతాయి.

ఈ ఫీచర్ రియల్ టైమ్ మూవెంట్స్ వెంటనే షేర్ చేసేందుకు (Instagram Instants) అద్భుతంగా ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. కానీ, చాలా మంది ఇన్‌స్టా యూజర్లు ఈ ఫీచర్‌తో విసుగు చెంది మాకొద్దు బాబోయ్ అంటున్నారు.. ఈ ఫీచర్ ఎలా ఆఫ్ చేయాలా? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో తెలియక కొందరు యూజర్లు పొరపాటున ఫొటోలను పంపించారు.

ఫస్ట్ టైమ్ కొత్త ‘ఇన్‌స్టాంట్స్’ ఫీచర్ వాడుతున్నారా? :
మీరు కూడా ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ‘ఇన్‌స్టాంట్స్’ సెక్షన్ ఓపెన్ చేస్తే.. ఇన్‌బాక్స్ రైట్ బాటమ్ కార్నర్ వద్ద స్మాల్ ఫొటోల గ్రూపుపై ట్యాప్ చేయాలి. యాప్ మొదట ఈ ఫీచర్ గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ చూపిస్తుంది. ఇన్‌స్టంట్స్‌లో పంపిన ఫొటోలు కొంత కాలం తర్వాత వాటంతట అవే అదృశ్యమవుతాయని వ్యూ లిస్టు ఉండదని, రియాక్షన్‌లు, రిప్లైలు పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయని అందులో పేర్కొంది.

ఆ తర్వాత ఇన్‌స్టంట్‌లను ఎలా చూడాలి? వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలో యాప్ మీకు చూపిస్తుంది. మీరు కెమెరా సెక్షన్ వద్ద దిగువన ఒక షట్టర్ బటన్ ఉంటుంది. అక్కడ ‘Friends’ ‘Closest Friends’ మధ్య ఎంచుకునే టోగుల్ ఆప్షన్ ఉంటుంది.

Read Also : Gold Price Today May 19 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి..! ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదా? ఏపీ, తెలంగాణలో తులం రేటు ఇదే

డిఫాల్ట్‌గా, ఇది ‘Friends’కు సెట్ అయి ఉంటుంది. కొన్నిసార్లు పొరపాటున రాంగ్ ఫొటోలను పంపుతుంటారు. కానీ, ఇప్పుడు మెటా ఫోటో పంపిన తర్వాత ‘Cancel’ చేసే ఆప్షన్ కూడా అందిస్తోంది. చాలా మంది ఇది గమనించరు. కొంతమందికి ఫోటో పంపిన విషయం కూడా తెలియకపోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో సాధారణంగా తమ పోస్ట్‌లను షేర్ చేసే ముందు వాటిని రివ్యూ చేసి ఎడిట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి ఇబ్బందిగా మారింది. అందుకే చాలామంది ఈ ఫీచర్‌ను వాడేందుకు ఇష్టపడటం లేదు. అయితే, మీరు ఈ ఫీచర్ ఎలా స్టాప్ చేయాలి? పొరపాటున పంపిన ఫొటోను ఎలా అన్ సెండ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇన్‌స్టంట్స్‌ను ఎలా ఆఫ్ చేయాలి? :
కొత్త ఇన్‌స్టంట్స్ ఫీచర్‌ ఆఫ్ చేసేందుకు మీ ప్రొఫైల్‌కు వెళ్లండి. సెట్టింగ్స్‌ కోసం రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న త్రి లైన్ మెనూపై క్లిక్ చేయండి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి ‘కంటెంట్ ప్రిఫరెన్సెస్’ ఆప్షన్‌కు వెళ్లండి. ఇక్కడ, మీకు ‘Hide Instants inbox’ అనే టోగుల్ కనిపిస్తుంది. అది ఆన్ చేయండి. మీరు ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇన్‌స్టంట్స్ ఫీచర్ మీ ఇన్‌బాక్స్‌లో ఇకపై కనిపించదు.

అలాగే, ఇతరులు పంపిన ఇన్‌స్టంట్స్ కూడా మీకు కనిపించవు. ఈ ఫీచర్‌ను పూర్తిగా ఆఫ్ చేయొద్దని అనిపిస్తే.. మీ ఇన్‌బాక్స్‌లోని ఇన్‌స్టంట్‌ల గ్రూపుపై ట్యాప్ చేసి పట్టుకుని, ఆపై రైట్ సైడ్ స్వైప్ చేయండి. ఇలా చేస్తే ఇన్‌స్టంట్‌లను పొందడం టెంపరరీగా ఆగిపోతుంది.

ఇన్‌స్టంట్‌లను ఎలా అన్‌సెండ్ చేయాలి :
మీరు ఇన్‌స్టంట్ పంపిన వెంటనే షట్టర్ బటన్ కింద ‘Undo’ ఆప్షన్ కనిపిస్తుంది. అవతలి వ్యక్తి ఇంకా ఫొటోను చూడకపోతే మీరు వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. లేదా మీ ఆర్కైవ్‌ను యాక్సెస్ చేసి అక్కడి నుంచి ఇన్‌స్టంట్‌ను డిలీట్ చేయొచ్చు. మీరు కెమెరా స్క్రీన్ రైట్ టాప్ కార్నర్ లో ఉన్న ఫోర్ బాక్స్ ఐకాన్‌ను ట్యాప్ చేయవచ్చు. తద్వారా ఇంకా ఫొటోను ఓపెన్ చేయని స్నేహితులకు కనిపించదు.