Pulse Oximeter: పల్స్ ఆక్సీమీటర్ సరిగ్గానే వాడుతున్నారా.. ఆక్సిజన్ లెవల్ ఇలా చూసుకోండి

ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన గాడ్జెట్ ఏంటంటే టక్కున చెప్పే సమాధానం స్మార్ట్ ఫోన్. ఈ కరోనా పుణ్యమా అని ఆ స్థానాన్ని పల్స్ ఆక్సీమీటర్ భర్తీ చేసేసింది.

How To Use Pulse Oximeter The Right Away Follow These 8 Steps

Pulse Oximeter: ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన గాడ్జెట్ ఏంటంటే టక్కున చెప్పే సమాధానం స్మార్ట్ ఫోన్. ఈ కరోనా పుణ్యమా అని ఆ స్థానాన్ని పల్స్ ఆక్సీమీటర్ భర్తీ చేసేసింది. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నాటి నుంచి ప్రతి ఇంట్లో ఒక ఆక్సీమీటర్ రెడీగా ఉంటుంది. డిమాండ్ ఉంది కాబట్టి ఈ రోజుల్లో మంచిది కొనాలంటే కచ్చితంగా రూ.2వేల 500వరకూ ఖర్చు పెట్టాల్సిందే.

దేశవ్యాప్తంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ అని లేకుండా పలు చోట్ల విచ్ఛలవిడిగా దొరికేస్తున్నాయి ఆక్సీమీటర్లు. అయితే పల్స్ ఆక్సీమీటర్ కొనేయగానే సరిపోదు. సరైన పద్ధతిలో వాడడం తెలియాలి.

పల్స్ ఆక్సీమీటర్ వాడే విధానం
*ముందుగా బ్లడ్ ఆక్సిజన్ లెవల్ చెక్ చేసుకునే ముందు 10 నుంచి 15నిమిషాలు రెస్ట్ తీసుకుని డీప్ బ్రీత్ తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ రీడింగ్ కనిపిస్తుంది.
*మీ చేతిని ఛాతిపై ఉంచుకుని కాసేపు వరకూ ఆగాలి.
*మీ చూపుడు వేలు లేదా మధ్య వేలిని ఆక్సీమీటర్ పై ఉంచాలి. ఆక్సీమీటర్ లో ఆగకుండా రీడింగ్స్ మారుతూనే ఉంటే చేతిని మార్చి మళ్లీ ప్రయత్నించాలి.
*రీడింగ్ స్థిరంగా ఉండేంత వరకూ పల్స్ ఆక్సీమీటర్ పై చేతివేలిని అలాగే ఉంచాలి.
*అందులో వచ్చిన రీడింగ్స్ లో అత్యధిక విలువను మాత్రమే రిజిష్టర్ చేసుకోవాలి. కొద్ది సెకన్ల పాటు చూపించిన ఒకే విలువను మాత్రమే నోట్ చేసుకోవాలి.
*రీడింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం.
*శ్వాస అందకపోవడం లేదా ఆక్సిజన్ లెవల్ 93శాతం కంటే తక్కువ కనిపిస్తుంటే వెంటనే మెడికల్ ప్రొఫెషనల్ ను కలవడం ఉత్తమం.

పల్స్ ఆక్సీమీటర్ కొనేముందు తెలుసుకోవాల్సినవి
*ఆక్సీమీటర్ ఎలాంటి టైప్ అనేది తెలుసుకోవాలి. ఇళ్లలో వాడేందుకు సాధారణంగా అందుబాటు ధరలో ఉండేదే తీసుకుంటారు.
*అదెంత కచ్చితమైన విలువలు ఇస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఖరీదైనది తీసుకోవడానికే ప్రయత్నించాలి. చౌకబారు వాటిని దూరంగానే ఉంచాలి.
*సర్టిఫికేషన్స్ చెక్ చేసుకోవాలి. హెల్త్ గ్యాడ్జెట్స్ వాడే ముందు అది చాలా ముఖ్యం.
*బ్రాండ్ తో పాటు ఫీచర్లు చెక్ చేసుకోవాలి. మంచి బ్రాండ్ తీసుకోవడం బెటర్.