UMANG App ద్వారా PF అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు

  • Publish Date - August 26, 2020 / 01:40 PM IST

కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. చాలామంది ఆర్థికపరంగా చాలా సమస్యలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి. లోన్ల కోసం ఎంతగా ప్రయత్నించిన దొరకని పరిస్థితి.. దీంతో చేసేది ఏమిలేక ఫిక్స్ డ్ డిపాజిట్ లోన్లను మధ్యలోనే టర్మ్  బ్రేక్ చేసేస్తున్నారు. అవసరాల కోసం డబ్బులు డ్రా చేేసేసుకుంటున్నారు..

కరోనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు మరికొంతమంది తమ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటున్నారు.. ఎంప్లాయిస్ ప్రావిడియంట్ ఫండ్ (EPF) నుంచి మనీ విత్ డ్రా చేసుకోవడం చాలా సులభం కూడా.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు… ఉన్నచోటనే ఉండి పీఎఫ్ అకౌంట్లో డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.



లాక్ డౌన్ సమయంలో ఈపీఎఫ్ఓ మెంబర్స్ కోసం ప్రభుత్వం కూడా EPFO నిబంధనలను సడలించింది.. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్లో కొంతమొత్తాన్ని విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కలిగించింది. ఈ సౌకర్యం జూన్ 30వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
https://10tv.in/whatsapp-advanced-search-rooms-and-new-icons-coming-soon/
అయినప్పటికీ మీ EPF అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఈపీఎఫ్ఓ మీ క్లయిమ్ అప్రూవ్ చేసిన వెంటనే ఆన్ లైన్ ద్వారా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయిపోతాయి..



అది ఎలాగంటే.. మీ స్మార్ట్ ఫోన్లో UMANG యాప్ ఇన్ స్టాల్ చేసుకోండి.. ఇది ప్రభుత్వ ఈ-గవర్నెన్స్ మొబైల్ యాప్.. ఇంట్లో కూర్చొనే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.. EPFO మెంబర్లందరూ తమ అకౌంట్ నుంచి UMANG యాప్ ద్వారా EPF మనీని ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు..

UMANG యాప్ ద్వారా మీరు PF విత్ డ్రా ఎలా అప్లయ్ చేయాలంటే?
* Play Store లేదా Apple స్టోర్ నుంచి UMANG యాప్ డౌన్‌లోడ్ చేయండి.
* యాప్ ఓపెన్ చేశాక సెర్చ్ మెనుకి వెళ్లి EPFO వెబ్ సైట్లోకి వెళ్లండి.
* ‘Employee Centric’ ఎంపిక చేసుకోండి.. ‘Raise Claim’ ఎంపికపై క్లిక్ చేయండి.
* EPF UAN నంబర్‌ను నమోదు చేయండి.
* రిజిస్టర్డ్ ఫోన్ నుంచి OTP వస్తుంది.. అది ఎంటర్ చేయండి..
* విత్ డ్రా చేసుకునే విధానాన్ని ఎంచుకోండి.. Submit పై క్లిక్ చేయండి.
* మీకు క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది.. మీరు మీ క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు