Mahindra xuv700 : కొత్త కారు.. 57 నిమిషాల్లో 25,000 బుకింగ్‌లు
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ కారు ఎక్స్‌యూవీ 700 తాజాగా విడుదలైంది. ఈ కారు బుకింగ్స్ గురువారం ప్రారంభమయ్యాయి.

Mahindra Xuv700
Mahindra xuv700 : ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ కారు ఎక్స్‌యూవీ 700 తాజాగా విడుదలైంది. ఈ కారు బుకింగ్స్ గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 10 గంటలకు బుకింగ్స్ ప్రారంభం కాగా.. 57 నిమిషాలు.. అంటే 10.57 amకే 25 వేల బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Read More : Mahindra Logo: XUV700 SUVతో పాటు కొత్త లోగో లాంచ్ చేయనున్న మహీంద్రా
కంపెనీ ప్రతినిధుల స్పందన
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మంచి స్పందన రావడంతో కంపెనీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ నక్రా మాట్లాడుతూ ఈ స్పందనను చూస్తే తమకు ఆనందంగా, గర్వాంగా ఉందని తెలిపారు. అటు సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కస్టమర్లకు తమ సంస్థపై ఎంత నమ్మకం ఉందో, తమ భుజాలపై ఎంత బాధ్యత ఉందో దీన్ని చూస్తుంటే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.
Read More : Anand Mahindra : మానవత్వం బతికే ఉంది, ఆనంద్ మహీంద్రా వీడియ
ఎక్స్‌యూవీ 700 ధర
మహీంద్రా వాహనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సెప్టెంబర్ నెలాఖరులో కంపెనీ ఎక్స్‌యూవీ 700 మోడల్ ను విడుదల చేసింది. దీనిని మోడల్, ఫీచర్లు చూసిన కస్టమర్లు కారు కొసం ఎగబడ్డారు. ఇక ధర విషయానికి వస్తే ప్రారంభ వేరియంట్(ఎక్స్‌షోరూం) ధర రూ.11.99 లక్షలుగా.. టాప్ వేరియంట్ ధర రూ.21.09లక్షలుగా నిర్ణయించారు. దీనిని పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో తొమ్మిది వేరియంట్లల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆల్‌వీల్ డ్రైవ్ ఫీచర్ కూడా ఉంది. ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది.