ICICI Bank Loan Against Securities : ప్రముఖ దేశీయ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాలు పొందిన కస్టమర్ల కోసం (Loan Against Securities -LAS) డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ కార్డు సర్వీసును Visa కార్డు ప్లాట్ ఫాంపై ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా కస్టమర్లు తమ అన్ని దేశీయ మర్చంట్ లావాదేవీలతోపాటు POS మిషన్లు, ఆన్ లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ కామర్స్ పోర్టల్స్ సహా ఇతర ప్లాట్ ఫాంలపై కూడా LAS అమౌంట్ వాడుకోవచ్చు.
LAS డెబిట్ కార్డుల సౌకర్యాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దేశంలో మొట్టమొదటగా బ్యాంకుగా ఐసీఐసీఐ బ్యాంక్ అవతరించింది. ఓవర్ డ్రాఫ్ట్ OD ఫెసిలిటీ పొందిన కస్టమర్లకు ఎలక్ట్రానిక్ కార్డులను జారీ చేయొచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఐసీఐసీఐ బ్యాంక్ LAS కస్టమర్లకు డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
LAS ఫెసిలిటీ పొందిన కొత్త కస్టమర్లకు డెబిట్ కార్డు జారీ అవుతుంది. LAS అకౌంట్ రెన్యువల్ సమయంలో ఆటోమాటిక్ గా రెన్యు చేసుకోవచ్చు. LAS అకౌంట్ ఓపెన్ చేసిన ఒక రోజు తర్వాత కస్టమర్లు డిజిటల్ డెబిట్ కార్డు పొందవచ్చు. ఈ కార్డును బ్యాంకు iMobile యాప్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. ఏడు పనిదినాల్లోగా ఫిజికల్ డెబిట్ కార్డు కూడా వస్తుంది. LAS పాత కస్టమర్లకు ఈ కార్డు వెంటనే పొందవచ్చు.
LAS డెబిట్ కార్డుతో ప్రయోజనాలివే :
ట్రాన్సాక్షన్ లిమిట్ : ఈ కొత్త డెబిట్ కార్డు ద్వారా రోజుకు రూ.3 లక్షల వరకు POS మిషన్లతో పాటు అన్ని ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు..
డిజిటల్ కార్డు : iMobile యాప్‌లో ఈ డిజిటల్ కార్డు పొందవచ్చు. ఒక బిజినెస్ డే సమయంలో డిజిటల్ కార్డును పొందవచ్చు.
ఆటోమాటిక్ రెన్యువల్ : ఈ కార్డు ఆటోమేటిక్‌గానే రెన్యూవల్ అవుతుంది. LAS అమౌంట్ రెన్యూవల్ ఆధారంగా అప్ డేట్ అవుతుంది.
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది పర్సనల్ లోన్ లానే వినియోగించుకోవచ్చు. మీ డెబిట్ కార్డుకు లోన్ క్రెడిట్ అవుతుంది. ఈ క్రెడిట్ అయిన డబ్బులను అవసరానికి వాడుకోవచ్చు. లేదంటే అలాగే అకౌంట్‌లో ఉంచుకోవచ్చు. మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్ డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.