Electric Folding Bike : మడతబెట్టే మినీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసిందోచ్.. టేబుల్ కింద చుట్టేయొచ్చు!

మడతబెట్టే మినీ బైక్ వచ్చేసింది. ఇదో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. చూడటానికి చిన్నపిల్లలు ఆడుకునే బైకు మాదిరిగా ఉంది. కానీ, అన్ని బైకుల మాదిరిగానే ఈ బైకుపై కూడా రయ్యమని దూసుకెళ్లొచ్చు.

Electric Folding Bike : మడతబెట్టే మినీ బైక్ వచ్చేసింది. ఇదో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. చూడటానికి చిన్నపిల్లలు ఆడుకునే బైకు మాదిరిగా ఉంది. కానీ, అన్ని బైకుల మాదిరిగానే ఈ బైకుపై కూడా రయ్యమని దూసుకెళ్లొచ్చు. గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక మనిషి వరకు ఈ మినీ బైకుపై ప్రయాణించవచ్చు.

అంతేకాదు.. ఈ బైకు మడతబెట్టేసుకోవచ్చు. మొత్తం మడతబెట్టి మీ ఆఫీసు టేబుల్ డెస్క్‌లో కూడా చుట్టిపెట్టేయొచ్చు. మడతబెడితే CPU సైజులోకి మారిపోతుంది.. మీరు బయటకు వెళ్లినా పార్కింగ్ పరేషాన్ అక్కర్లేదు!.. చక్కగా ఒక పక్కన మడతబెట్టేయొచ్చు.

ఈ మినీ బైకును జపాన్ కు చెందిన ICOMA అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తయారుచేసింది. ఇది స్టార్టప్ సంస్థ.. ఈ కంపెనీ బైకు డిజైనర్లు.. Tatamel Bike అనే మరో బైక్ మేకర్ కంపెనీతో కలిసి సంయుక్తంగా ఈ మినీ పోల్డింగ్ బైక్ రూపొందించారు. ఈ బైకుపై  ఒక మనిషి మాత్రమే కూర్చొని ప్రయాణించేలా డిజైన్ చేశారు.

పార్కింగ్ స్థలం కోసం వెతకనవసరం లేదు. ఆఫీసుకు వెళ్తే టేబుల్ కింద కూడా మడతబెట్టేయొచ్చు. లిథియం ఐరన్ పాస్పేట్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ లేటెస్ట్ మోడల్ ICOMA బైకు టాప్ స్పీడ్ (40km/h) వరకు ఉంటుంది.

కసారి సింగిల్ చార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనికి పోర్టబుల్ పవర్ సప్లయ్ కూడా ఉంది. పవర్ సోర్స్ కోసం కూడా ఈ బైకును కూడా వినియోగించుకోవచ్చు.

ఈ బైకు సైడ్ ప్యానెల్స్ నచ్చిన కలర్స్, మెటేరియల్స్ తో మార్చేసుకోవచ్చు. ఈ మినీ బైక్ అసలు సైజు 1230mm పొడవు ఉంటుంది. 1000mm ఎత్తు, 650mm వెడల్పు ఉంటుంది. అదే మడతబెడితే (ఫోల్డింగ్) చేస్తే..   700mm వెడల్పు.. 680mm ఎత్తు ఉంటుంది. ఈ బైకును సులభంగా ఎలానంటే అలా మడత మార్చుకునేలా కస్టమైజడ్ డిజైన్ చేశారు. ఆఫీసు టేబుల్ కింద పట్టేంత సైజులోకి మారిపోతుంది. ఇంతకీ ఈ మినీ బైకు ధర ఎంతో కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు