Mobile Phone
Mobile Phone : చాలామందికి ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అత్యవసరంలో అవి ఉపయోగపడతాయని ఆలోచిస్తారు. అయితే డబ్బులు అలా పెట్టడం ప్రమాదకరమని మీకు తెలుసా? ఈ అలవాటు ఒక్కోసారి ప్రాణాల్ని బలిగొంటుంది.
చాలామంది మొబైల్ ఫోన్ కవర్లలో రూ.10, రూ.50 నుండి రూ.500 నోట్ల వరకూ పెడుతుంటారు. అలా పెట్టడం చాలా ప్రమాదకరం. ఫోన్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు హ్యాండ్ సెట్ వేడిగా అవుతుంది. అది మీరు గమనించే ఉంటారు. ముఖ్యంగా ఫోన్ వెనుక భాగం చాలా వేడిగా అనిపిస్తుంది. మీరు ఫోన్ కవర్ వెనుక నోట్ ఉంచినట్లైతే ఫోన్ లోపల వేడిగా ఉండే మార్గం బ్లాక్ అవుతుంది. దాంతో ఇది పేలవచ్చు. ఇంకో విషయం ఏంటంటే సెల్ ఫోన్లకు బిగుతుగా ఉండే కవర్లు వాడకూడదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఫోన్ లోపల ఉండే వేడి బయటకు రాకపోతే అది పేలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కరెన్సీ నోట్ల తయారీలో అనేక రసాయనాలను ఉపయోగిస్తారు. ఫోన్ వేడెక్కినపుడు వాటి మీద ఉండే రసాయనాల వల్ల మంటలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ ఫోన్ కవర్ వెనుక ఎలాంటి కరెన్సీ నోట్లు పెట్టకండి. ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు ఉన్న సందర్భాల్లో ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి మాట్లాడకండి. నొన్ని సార్లు నెట్ వర్క్ సమస్య రావచ్చు. ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం, ఫోన్లో మాట్లాడటం రెండూ ప్రమాదకరమే.
Hyderabad Woman: స్మార్ట్ ఫోన్ వల్ల కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకున్న మహిళ
చేతిలో ఫోన్ లేకపోతే ఏ పనీ చేయలేని పరిస్థితి వచ్చేసింది. సెల్‌ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి. అతిగా ఫోన్ వాడటం వల్ల తలనొప్పి, టెన్షన్, నిద్రపట్టకపోవడం, చెవిలో పోటు వంటి అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చును. పిల్లలు కూడా మొబైల్‌లో గేమ్‌లు ఆడటం ఎక్కువ అయ్యింది. ఇది వారి ఏకాగ్రతపైనా, చదువుపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఫోన్ వాడుతున్నప్పుడు రిలీజ్ అయ్యే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ శరీరంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఫోన్ వాడేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.