In-flight Wi-Fi Services : గుడ్ న్యూస్.. ఇకపై భారతీయ విమాన ప్రయాణాల్లో ఇన్-ఫ్లయిట్ వై-ఫై సర్వీసులు.. వాట్సాప్, యూట్యూబ్ వాడొచ్చు!

In-flight Wi-Fi Services : భారతీయ విమానయాన ఆపరేటర్లు గాలిలో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు.

In-flight Wi-Fi Will Be Available On Indian Airlines

In-flight Wi-Fi Services : భారతీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారత గగనతలంలోకి ఇన్-ఫ్లైట్ వై-ఫై సర్వీసు వస్తుందని కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాం. అయితే, ఇప్పుడు ఆ నిరీక్షణ ఎట్టకేలకు ముగియనుంది. అతి త్వరలో విమాన ప్రయాణాల్లో కూడా వై-ఫై సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

భారతీయ విమానయాన ఆపరేటర్లు గాలిలో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ఇతర విమానయాన సంస్థలు ఈ ఇన్ ఫ్లయిట్ వై-ఫై సర్వీసులను అందిస్తాయి.

3వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ప్రయాణికులు వాట్సాప్ లేదా యూట్యూబ్‌లో వీడియోలను యాక్సస్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఫీచర్‌ రిలీజ్‌పై భారత ప్రభుత్వం ఇటీవలే నోటిఫై చేసింది. అయితే ఈ విషయంలో పనులు నెమ్మదిగా సాగాయి. కొత్త నిబంధన ప్రకారం.. ఎయిర్‌లైన్ ఆపరేటర్‌లు ఇప్పుడు విమానాలలో వై-ఫై సర్వీసులకు సెటప్ అందించాల్సి ఉంది. అంతేకాదు.. నామమాత్రపు రుసుముతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లతో భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉంటుంది.

ఫ్లైట్, మారిటైమ్ కనెక్టివిటీ రూల్స్, 2018 ప్రకారం.. టెరెస్ట్రియల్ మొబైల్ నెట్‌వర్క్‌లతో జోక్యం లేకుండా భారత గగనతలంలో కనీసం 3వేల మీటర్ల ఎత్తులో విమానంలో మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసులను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. భారత గగనతలంలో 3వేల మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత కూడా విమానంలో ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఉపయోగించవచ్చు.

తద్వారా విమానంలోని ప్రయాణికులు వై-ఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధన ప్రకారం.. భారతీయ గగనతలంలో కనీస ఎత్తు ఉన్నప్పటికీ, విమానంలో ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకాన్ని అనుమతిస్తే విమానంలో వై-ఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి” అని నివేదిక వెల్లడించింది.

Read Also : Canada Student Visa : భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన కెనడా.. పాపులర్ స్టూడెంట్ వీసా స్కీమ్‌ నిలిపివేత..!