Canada Student Visa : భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన కెనడా.. పాపులర్ స్టూడెంట్ వీసా స్కీమ్‌ నిలిపివేత..!

Canada Student Visa Scheme : కెనడా హౌసింగ్, వనరుల సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ వీసా ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది.

Canada Student Visa : భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన కెనడా.. పాపులర్ స్టూడెంట్ వీసా స్కీమ్‌ నిలిపివేత..!

Canada Discontinues Popular Student Visa Scheme

Updated On : November 9, 2024 / 9:01 PM IST

Canada Student Visa Scheme : కెనడాలో చదువుల కోసం వెళ్లాలనుకుంటున్నారా? భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాకిచ్చింది. కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS) వీసా ప్రొగ్రామ్ నిలిపివేసింది. కెనడా హౌసింగ్, వనరుల సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. దేశంలోకి వలసలు పెరిగిపోతున్న తరుణంలో అక్కడి కెనడియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్‌ నిలిపేయాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్, చైనా, కొలంబియా, కోస్టారికా, ఇండియా, మొరాకో, పాకిస్థాన్, పెరూ, ఫిలిప్పీన్స్, వియత్నాంతో సహా 14 దేశాల నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్ దరఖాస్తులను అందిస్తోంది. కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ నిలిపివేయడంతో భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) 2018లో ఈ ప్రొగ్రామ్ అమల్లోకి తీసుకొచ్చింది. కెనడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి వివరాలను అప్‌డేట్ చేసింది. దరఖాస్తు ప్రక్రియకు విద్యార్థులందరికీ సమాన, న్యాయమైన పరిమితిని అందించే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఈ పథకం కింద నవంబర్ 8న మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే అనుమతిస్తారు. ఆపై వచ్చే అన్ని దరఖాస్తులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ స్ట్రీమ్ కింద ప్రాసెస్ అవుతాయి.

ఈ వీసా ప్రొగ్రామ్ నిలిపివేయడంతో భారత్, 13 ఇతర దేశాల విద్యార్థులు వీసా పొందడం కష్టతరంగా మారనుంది. కెనడా మొదటిసారిగా దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. 2025లో జరగనున్న ఫెడరల్ ఎన్నికల నేపథ్యంలో కెనడియన్ రాజకీయాల్లో ఈ సమస్య అత్యంత వివాదాస్పదంగా మారింది. కెనడాలో చాలా మంది వలసదారులు ఉన్నారని పోల్స్ సూచిస్తున్నాయి.

Read Also : Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, ఫీచర్లు లీక్!