India orders WhatsApp to block accounts engaged in scam calls, over 36 lakh accounts banned
Whatsapp Block Accounts in India : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) నుంచి భారత్‌లోని యూజర్లకు మోసపూరిత కాల్‌లు వస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. గుర్తుతెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి వాయిస్, వీడియో కాల్స్ వస్తున్నాయని వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. అమాయక యూజర్లను లక్ష్యంగా చేసుకుని స్కామర్‌లు హానికరమైన కోడ్లను పంపుతున్నారు. ఇలాంటి ఫోన్ నంబర్‌లపై చర్య తీసుకోవడానికి, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే అకౌంట్లను నిషేధించాలని భారత ప్రభుత్వం వాట్సాప్‌ను ఆదేశించింది. టెలికాం శాఖ సంచార్ సాథి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. భారత్‌లో 36 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది. వాట్సాప్ యూజర్ల భద్రతను నిర్ధారించడానికి కంపెనీ సహకరిస్తోందని చెప్పారు.
వాట్సాప్ అకౌంట్లను బ్లాక్ చేయాలి :
దేశంలో పెరుగుతున్న వాట్సాప్ కాల్ స్కామ్ కేసులను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అడిగారు. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ‘ వాట్సాప్‌తో యాక్టివ్‌గా ఉన్నాం. కస్టమర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. మోసపూరిత యూజర్లుగా గుర్తించిన యూజర్ల రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు యాక్టివ్‌గా సహకరిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. వాట్సాప్‌లో స్కామర్ల మోసం కారణంగా 36 లక్షల ఫోన్ నంబర్లు డిస్‌కనెక్ట్ అయ్యాయి. వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసినట్టు తెలిపారు. వాట్సాప్ ప్రకటనలో యూజర్ల భద్రతను నిర్ధారించడానికి ప్రయత్నాలను గుర్తించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
యూజర్ భద్రతకు వాట్సాప్ నిరంతర నిబద్ధతకు మంత్రిగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ నుంచి స్కామర్ల నుంచి తొలగించి సురక్షితమైన యూజర్ అనుభవాన్ని అందించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని వాట్సాప్ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు.. అనుమానాస్పద కాల్‌లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయమని వాట్సాప్ యూజర్లను కోరుతోంది. అనుమానాస్పద కాల్‌లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని, తద్వారా వారిపై తగిన చర్యలు తీసుకోవచ్చునని వాట్సాప్ గతంలో యూజర్లను కోరింది.
India orders WhatsApp to block accounts engaged in scam calls, over 36 lakh accounts banned
అనుమానాస్పద మెసేజ్‌లు/కాల్‌లను నిరోధించడంతో పాటు రిపోర్టు చేయడం వంటి మోసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వినియోగదారులకు అనుమతినిస్తుందని వాట్సాప్ ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తెలియని అంతర్జాతీయ లేదా దేశీయ ఫోన్ నంబర్‌ల నుంచి కాల్‌లను స్వీకరించినప్పుడు, అనుమానాస్పద అకౌంట్లను బ్లాక్ చేసేందుకు రిపోర్టు చేసేందుకు వాట్సాప్ అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ అకౌంట్లను వాట్సాప్‌కు రిపోర్టు చేయడం చాలా ముఖ్యం. తద్వారా వాటిపై అవసరమైన చర్య తీసుకుంటామన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి ఆయా వాట్సాప్ అకౌంట్లను వెంటనే బ్యాన్ చేస్తామని తెలిపారు. మీ వ్యక్తిగత వివరాలను మీ కాంటాక్టులను మాత్రమే కనిపించేలా ఉంచడం వలన స్కామర్ల నుంచి మీ అకౌంట్లను ప్రొటెక్ట్ చేయడంలో సాయపడుతుంది.
అనేక మంది వాట్సాప్ యూజర్లు ఇథియోపియా (+251), మలేషియా (+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254), వియత్నాం (+84), ఇతర దేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు నివేదించారు. కొంతమంది యూజర్లు ఆకర్షణీయమైన పార్ట్-టైమ్ జాబ్ ఆఫర్‌లతో పాటు గుర్తుతెలియని నంబర్‌ల నుంచి చేసిన వీడియో కాల్‌లకు సంబంధించిన మెసేజ్‌లను కూడా రిపోర్టు చేశారు. అంతర్జాతీయ నంబర్ నుంచి కాల్ వచ్చినందున, కాల్ చేస్తున్న వ్యక్తి వేరే దేశంలో ఉన్నారని అర్థం కాదు. వాట్సాప్ కాల్స్ ఇంటర్నెట్ ద్వారా చేసే వీలుంది. ఎవరైనా మీరు ఉన్న నగరంలోనే ఉండి వాట్సాప్ ద్వారా అంతర్జాతీయ నంబర్ నుంచి కాల్ చేయవచ్చు.