UPI Payments : భారతీయులు యూపీఐ ద్వారా విదేశాల నుంచి పేమెంట్స్‌ అందుకోవచ్చు..!

భారతీయ యూపీఐ (UPI) పేమెంట్ యూజర్లకు శుభవార్త... విదేశాల నుంచి చేసే యూపీఐ పేమెంట్స్ ద్వారా భారతీయులు డబ్బులు పొందవచ్చు..

UPI Payments : భారతీయ యూపీఐ (UPI) పేమెంట్ యూజర్లకు శుభవార్త… విదేశాల నుంచి చేసే యూపీఐ పేమెంట్స్ ద్వారా భారతీయులు డబ్బులు అందుకోవచ్చు.. అంటే.. విదేశాల్లోని భారతీయులు యూపీఐ పేమెంట్స్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు. 2022 ఏడాది నుంచి ఈ కొత్త యూపీఐ నగదు లావాదేవీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. 2022 ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో ఈ UPI Payments సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

విదేశీ నగదు ట్రాన్స్‌ఫర్‌ సంస్థ వెస్ట్రన్‌ యూనియన్‌తో భారత నగదు చెల్లింపుల సంస్థ NPCI, ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (NIPL‌) ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో విదేశాల్లోని ఎన్ఆర్ఐలతో సహా భారతీయులంతా UPI Payments App ద్వారా నగదు లావాదేవీలను జరుపుకునే అవకాశం లభించనుంది. ఈ మేరకు NIPL సీఈవో రితేష్ శుక్లా ఒక ప్రకటనలో వెల్లడించారు. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి రావడం ద్వారా వెస్ట్రన్ యూనియన్ సహా పలు సంస్థల భాగస్వామ్యంతో విదేశాల్లో ఉండే 30 మిలియన్ల భారతీయులకు లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.

భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలతో పాటు అందరూ యూపీఐ ద్వారా లావాదేవీలను సులభంగా నిర్వహించుకోవచ్చు. వెస్టన్ యూనియన్, యూపీఐ ఇంటిగ్రేటెడ్ ఛానెల్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఫారెన్ మార్కెట్ అయిన రెమిటెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఛార్జీలు సాధారణంగా మార్కెట్ డైనమిక్స్, ఛానెల్‌లపై ఆధారపడి ఉంటాయి.

Read Also : Windows 11 Bug : కొత్త విండోస్‌ 11 వెర్షన్‌లో బగ్‌.. మానిటర్ రంగులు మార్చేస్తుంది..!

ట్రెండింగ్ వార్తలు