Infinix Hot 40i Launch Date : ఈ నెల 16నే ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Infinix Hot 40i Launch Date : ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఫోన్ వస్తోంది. ఈ నెల 16న లాంచ్ ఈవెంట్ జరుగనుంది. రాబోయే ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ మోడల్ గురించి ఫ్లిప్‌కార్ట్‌లో కంపెనీ రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Hot 40i India Launch Date Set for February 16

Infinix Hot 40i Launch Date : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. భారత మార్కెట్లో ఈ నెల (ఫిబ్రవరి 16న)లో ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ కొత్త ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. ఈ మేరకు ఇన్ఫినిక్స్ ఒక ప్రకటనలో ధృవీకరించింది.

Read Also : Apple iPhone 16 Series : కొత్త ఆపిల్ ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. భారీ బ్యాటరీలతో ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 4 మోడల్స్..!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించి ప్రత్యేకమైన మైక్రోసైట్ కూడా రూపొందించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 40, ఇన్ఫినిక్స్ హాట్ 40 ప్రోతో పాటు ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ మోడల్ ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అయింది. ఈ కొత్త ఫోన్ యూనిసోక్ టీ606 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాదు.. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

రూ. 10వేల లోపు ధర ఉండొచ్చు? :
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ప్రత్యేక మైక్రోసైట్‌ను రూపొందించింది. ఈ జాబితా ప్రకారం.. హ్యాండ్‌సెట్ ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 12:00 గంటలకు లాంచ్ కానుంది. రూ.10వేల ధర కేటగిరీలో ఉండే అవకాశం ఉంది. 8జీబీ ఆన్‌బోర్డ్ ర్యామ్, 256జీబీ స్టోరేజీ, 8జీబీ వర్చువల్ మెమరీతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ రెగ్యులర్ ఇన్ఫినిక్స్ హాట్ 40, ఇన్ఫినిక్స్ హాట్ 40 ప్రోతో పాటు డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. సౌదీఅరేబియాలో 4జీబీ ర్యామ్ + 128జీబీ మోడల్ ధర ఎస్ఏఆర్ 375 (దాదాపు రూ. 8,300) ధర ట్యాగ్‌ని కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ గ్లోబల్ వేరియంట్ 6.56-అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డిస్‌ప్లేను 60హెచ్‌జెడ్ నుంచి 90హెచ్‌జెడ్ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 480నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. యూనిసోక్ టీ606 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. దీనితో పాటు గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఏఐ సపోర్టుతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెల్ఫీ షూటర్ కూడా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Vivo Y200e Price : భారత్‌కు వివో Y200e కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!