Infinix Hot 50 5G : ఇన్ఫినిక్స్ నుంచి కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 5నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Infinix Hot 50 5G Launch : ఇన్ఫినిక్స్ హాట్ 50 ఫోన్ సెప్టెంబరు 5న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ 5జీ ఫోన్ ధర రూ. 10వేల లోపు ఉంటుందని అంచనా.

Infinix Hot 50 5G to launch on September 5_ What to expect

Infinix Hot 50 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఇన్ఫినిక్స్ ఫస్ట్ 2024 హాట్ సిరీస్ మెంబర్ ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 5న వస్తుందని కంపెనీ ధృవీకరించింది. దీనికి సంబంధించి మైక్రో-వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ అందించనుంది. ఈ విభాగంలో అత్యంత స్లిమ్మెస్ట్, 5జీ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. రాబోయే ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 16 Series : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ఎయిర్ ప్యాడ్స్, ఆపిల్ వాచ్ కూడా..!

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ :
ఇన్ఫినిక్స్ హాట్ 50 ఫోన్ సెప్టెంబరు 5న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ 5జీ ఫోన్ 7.8ఎమ్ఎమ్ మందంగా ఉంటుంది. సెగ్మెంట్‌లో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. రాబోయే ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ సెగ్మెంట్-ఫస్ట్ టీయూవీ ఎస్‌యూడీ ఎ-లెవల్ 60-నెలల ఫ్లూయెన్సీ  అందించనుంది. 5 ఏళ్ల వరకు స్పీడ్ పర్పార్మెన్స్ అందిస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ నీరు, ధూళిని తట్టుకునేలా ఐపీ54 సర్టిఫికేషన్‌తో వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ లాంచ్ కోసం మైక్రో-వెబ్‌సైట్ రూపొందించింది. ఈ ఫోన్ రూ. 10వేల లోపు ఉంటుందని అంచనా. అయితే, కచ్చితమైన ధరను లాంచ్ చేసిన తర్వాతే వెల్లడించనుంది. మైక్రో-వెబ్‌సైట్ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్‌ను కూడా వెల్లడిస్తుంది. బ్యాక్ ప్యానెల్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సర్కిల్ ఎడ్జ్‌లతో రెక్టాంగ్యులర్ ఐలాండ్ ఉంచిది. బ్యాక్ ప్యానెల్ కొద్దిగా సన్నగా కనిపిస్తుంది. బ్యాక్ ప్యానెల్ దిగువ భాగంలో ఇన్ఫినిక్స్ 5జీ బ్రాండ్‌తో వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫీచర్లు (అంచనా) :
హాట్ 50 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 5జీ ప్రాసెసర్‌తో వస్తుంది. యూజర్లకు లైటనింగ్ స్పీడ్ కనెక్టివిటీ, పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 4జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్ యూజర్ల అవసరాలకు తగినంత స్టోరేజీ అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ :
ఇన్ఫినిక్స్ కొత్త నోట్ 40 రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. నోట్ 40 సిరీస్‌కి బీఎండబ్ల్యూ గ్రూప్ కంపెనీ డిజైన్ వర్క్స్‌తో వచ్చింది. రేసింగ్ ఎడిషన్ ఫార్ములా 1 రేసింగ్ స్పీడ్ అందిస్తుంది. అడ్వాన్సడ్ టెక్నాలజీ డిజైన్‌తో అందిస్తుంది. ఆగస్ట్ 26, 2024 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Poco F6 Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో F6పై భారీ డిస్కౌంట్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

ట్రెండింగ్ వార్తలు