Infinix Inbook Air Pro Plus : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్‌ప్రో ప్లస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Infinix Inbook Air Pro Plus : ఈ ల్యాప్‌టాప్‌ను అక్టోబర్ 22 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

Infinix Inbook Air Pro Plus : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్‌ప్రో ప్లస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Infinix Inbook Air Pro Plus With OLED Display, Intel Core i5 Chipset Launched

Updated On : October 18, 2024 / 10:45 PM IST

Infinix Inbook Air Pro Plus : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్‌ప్రో ప్లస్ పేరుతో కొత్త మోడల్ ప్రవేశపెట్టింది. ఈ ల్యాప్‌టాప్ ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5జీతో పాటుగా లాంచ్ అయింది. ఈ ఫోన్ కంపెనీ మొట్టమొదటి క్లామ్‌షెల్-స్టయిల్ ఫోల్డబుల్ ఫోన్ కూడా.

ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్‌ప్రో ప్లస్ 120Hz ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ i5 చిప్‌సెట్, 16జీబీ ర్యామ్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లకు కోపైలట్ కీతో సపోర్టు అందిస్తుంది. ఇన్ఫినిక్స్ సన్నగా తేలికైన 14-అంగుళాల ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్ అని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్‌ప్రో ప్లస్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్ ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ. 49,900. ఈ డివైజ్ మొత్తం బ్రౌన్, సిల్వర్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను అక్టోబర్ 22 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ ఇన్‌‌బుక్ ఎయిర్‌ప్రో+ స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ ఇన్‌‌బుక్ ఎయిర్ ప్రో+ 2.8K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 440నిట్స్ గరిష్ట ప్రకాశంతో 14-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 100 శాతం ఎస్ఆర్‌జీబీ డీసీఐ-పీ3 కలర్ గామట్ కవరేజీకి సపోర్టు ఇస్తుంది. కొలతల పరంగా చూస్తే.. సన్నని పాయింట్ వద్ద 4.5ఎమ్ఎమ్ మందం, కేవలం కిలో బరువు ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, విండోస్ హలో అథెంటికేషన్‌కు సపోర్టు ఇచ్చే ఇన్‌ఫ్రారెడ్ (IR) సామర్థ్యాలతో హెచ్‌డీ వెబ్‌క్యామ్‌ను కూడా కలిగి ఉంది.

ఈ ల్యాప్‌టాప్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1334యూ ప్రాసెసర్‌తో 10 కోర్లు, 4 థ్రెడ్‌లు, 4.6GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. చిప్‌సెట్ 4,267MHz వద్ద 16జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ ఎమ్2 ఎన్‌వీఎమ్ఈ పీసీఐఈ జనరేషన్ 3 ఎస్ఎస్‌డీ స్టోరేజీతో వస్తుంది. ఇంటెల్ ఐరీస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)ని కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్ ప్రో+ విండోస్ 11లో రన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్‌బాట్‌ (Copilot) కీతో వస్తుంది.

కనెక్టివిటీ పరంగా, ల్యాప్‌టాప్‌లో రెండు యూఎస్‌‌బీ టైప్-సి పోర్ట్‌లు, ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. వై-ఫై 6, బ్లూటూత్ 5.2ని కూడా కలిగి ఉంది. ఇంటర్నల్ ఫ్లాష్ లింక్ ఫీచర్‌తో వినియోగదారులు మొబైల్ డివైజ్‌లు, ల్యాప్‌టాప్ మధ్య ఫైల్‌లను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్ ప్రో+కి 57Wh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. యూఎస్‌బీ టైప్-సి ద్వారా ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 65డబ్ల్యూ ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తుంది.

Read Also : Honor X7c Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో హానర్ X7c ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?