ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది కొంటే బాగుంటుంది?

మీరు ఎక్కువ స్టోరేజ్‌, అధిక బ్యాటరీ సామర్థ్యంతో పాటు టాప్ టైర్ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనుకుంటే..

ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది కొంటే బాగుంటుంది?

Updated On : May 3, 2025 / 9:51 PM IST

టెక్ మార్కెట్లో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. మీరు కూడా మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా? అయితే, ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్, టెక్నో వీ ఫ్లిప్ 5జీ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే. రూ.50,000లోపే లభ్యమవుతున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్‌? మీకు ఏ ఫోన్ నచ్చుతుంది? మీ అవసరాలకు ఏది అనుగుణంగా ఉంటుంది? వంటి వివరాలు వాటి ఫీచర్ల ద్వారా తెలుసుకోచ్చు.

అమెజాన్ సమ్మర్‌ సేల్‌లోనూ ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5జీ, టెక్నో వీ ఫ్లిప్ 5జీ ఫ్లిప్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ స్మార్ట్‌ఫోన్ల ధరలు, వివరాలు పోల్చి చూస్తే మీకు ఏది అనువుగా ఉంటుందో తెలుసుకోవచ్చు.

ఇవీ తేడాలు
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంది. స్టోరేజ్ 512GB. మల్టీ టాస్కింగ్, యాప్ హ్యాండ్లింగ్, మిడ్-టు-హై లెవల్ గేమింగ్‌కు బాగుంటుంది. ఫాంటమ్ V ఫ్లిప్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ ఉంటుంది. స్టోరేజ్: 256GBగా ఉంది. అంటే ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ రెట్టింపు స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5G బ్యాటరీ సామర్థ్యం: 4,720mAh. ఫాస్ట్ ఛార్జింగ్ 70W వైర్డుతో ఉంది. మరోవైపు, టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G బ్యాటరీ సామర్థ్యం 4,000mAh. ఫాస్ట్ ఛార్జింగ్ 45W వైర్డుతో ఉంది.

కెమెరాలు ఇలా..
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5Gలో బ్యాక్‌ కెమెరాలు 50MP (OIS ప్రైమరీ), 50MP (సెకండరీ)తో ఉన్నాయి. వీడియో రికార్డింగ్‌ 4K సపోర్టుతో ఉంటుంది. టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5Gలో బ్యాక్‌ కెమెరాలు 64MP (ప్రైమరీ), 13MP (సెకండరీ), ఫ్రంట్ కెమెరా 32MP ఉన్నాయి.

ధరలు ఇలా..
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5G వేరియంట్ 8GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ.54,999. టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.49,999.

ఏది కొనాలి?
మీరు ఎక్కువ స్టోరేజ్‌, అధిక బ్యాటరీ సామర్థ్యంతో పాటు టాప్ టైర్ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనుకుంటే ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5G కొనండి.

తక్కువ ధరకు మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనుకుంటే టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G కొనండి.