Instagram Quiet Mode : ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. Quiet మోడ్ ఎలా ఎనేబుల్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!

Instagram Quiet Mode : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఇటీవల తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Instagram Quiet Mode : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఇటీవల తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అదే.. క్వైట్ మోడ్ (Quiet Mode) అని పిలిచే ఈ ఫీచర్ ద్వారా స్నేహితులు, ఫాలోవర్లతో కనెక్ట్ అయ్యేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

ఇన్‌కమింగ్ నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయడంతో పాటు డైరెక్ట్ మెసేజ్‌లకు (DMలు) ఆటోమాటిక్‌గా రిప్లే ఇవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా లేరని ఫాలోవర్లను హెచ్చరించేందుకు అకౌంట్ స్టేటస్ ‘ఇన్ క్వైట్ మోడ్’కి సెట్ చేసుకోవచ్చు. టీనేజ్ యూజర్లు వారి స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహించేందుకు కొత్త ఫీచర్‌ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

‘టీనేజ్ పిల్లలు కొన్నిసార్లు కొంత సమయం తీసుకోవాలని భావిస్తుంటారు. రాత్రిపూట, చదువుతున్నప్పుడు, స్కూల్ సమయంలో తమ ఏకాగ్రతను నిలిపేందుకు అనేక మార్గాల కోసం చూస్తుంటారు. మీ షెడ్యూల్‌కు సరిపోయేలా మీ మ్యూట్ మోడ్ గంటలను సులభంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A14, గెలాక్సీ A23 5G ఫోన్లపై భారీ సేల్ ఆఫర్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ఈ ఫీచర్ ఆఫ్ చేసిన తర్వాత.. మీకు నోటిఫికేషన్‌ల ద్వారా అలర్ట్ పొందవచ్చు. తద్వారా మీరు మిస్ అయిన వాటిని తెలుసుకోవచ్చు. మీ అకౌంట్ ‘క్వైట్ మోడ్‌లో’ సెట్ చేయాలనుకుంటే.. కొత్త ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో క్వైట్ మోడ్‌ని ఎనేబుల్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

WhatsApp for iOS update rolls out ‘Search by Date Feature’

* మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్‌ని ఓపెన్ చేయండి.
* మీ ప్రొఫైల్ ఐకాన్‌పై Tap చేయండి.
* ఆ తర్వాత, మీ స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న 3 బార్‌లపై Tap చేయండి.
* సెట్టింగ్‌లను ఎంచుకుని, నోటిఫికేషన్‌లపై Tap చేయండి.
* క్వైట్ మోడ్‌ని ఎనేబుల్ చేసేందుకు నోటిఫికేషన్‌లపై Tap చేయండి. ఆపై టోగుల్‌ని On చేయండి.

మరో వార్తలో Instagram ఈ ఏడాదిలో ఫిబ్రవరి నుంచి మెయిన్ బార్ నుంచి షాపింగ్ ట్యాబ్‌ను తొలగించాలని ప్రకటించింది. కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేసే బటన్ కిందికి మూవ్ అవుతుంది. అయితే రీల్స్ ట్యాబ్ కుడి వైపుకు వస్తుంది. ఈ మార్పులతో యూజర్లను స్నేహితులతో కనెక్ట్ అయ్యేందుకు యాప్‌పై ఆసక్తిని షేర్ చేయడానికి సులభతరం చేస్తాయని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp iOS Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. iOS యూజర్లు చాట్‌ మెసేజ్‌లను తేదీల వారీగా సెర్చ్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు