Instagram Outage : ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. నిలిచిపోయిన సర్వీసులు.. యూజర్ల ఫిర్యాదులు, మీమ్స్ వైరల్!

Instagram Outage : భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులకు అంతరాయం కలిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు సంబంధించి వేలాది మంది వినియోగదారులు సమస్యలను నివేదిస్తున్నారు.

Instagram Faces Outage As Thousands Report Issues Worldwide

Instagram Outage : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్ స్తంభించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులకు అంతరాయం కలిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు సంబంధించి వేలాది మంది వినియోగదారులు సమస్యలను నివేదిస్తున్నారు.

డౌన్‌డెటెక్టర్, అవుట్‌టేజ్ మానిటరింగ్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి 872 మంది వినియోగదారులు, భారత్‌లో 1,537 మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ అంతరాయ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. #Instagramdown అనే హ్యాష్‌ట్యాగ్‌తో వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొందరు యూజర్లు మీమ్స్ కూడా వైరల్ చేస్తున్నారు.

ఇన్‌స్టాలో తలెత్తిన సాంకేతిక సమస్యల సమస్యలతో కొందరు యూజర్లు మెసేజ్‌లను పంపలేరు.. ప్లాట్‌ఫారమ్‌లో డైరెక్ట్ మెసేజ్‌లు లేదా డీఎమ్ యాక్సెస్ చేయలేరు. డీఎమ్ ఫీచర్ వినియోగదారులు టెక్స్ట్, ఫొటోలు, పోస్ట్‌లను ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది యూజర్లతో ప్రైవేట్‌గా షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఈ సాంకేతిక సమస్యలు మంగళవారం సాయంత్రం 5:14 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు, ఇన్‌స్టాగ్రామ్ లేదా పేరంట్ కంపెనీ మెటా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

అంతకుముందు అక్టోబర్ 15న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అమెరికాలో వేలాది మంది అంతరాయంతో ప్రభావితమయ్యారు. వినియోగదారులు సోషల్ మీడియాలో అవాంతరాల గురించి పోస్ట్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా వాట్సాప్ డౌన్ అయినప్పుడల్లా మీమ్‌లను షేర్ చేస్తున్నారు.

Read Also : Ayushman Bharat : 70 ఏళ్లు పైబడిన పెద్దలకు రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులు, బెనిఫిట్స్ ఏంటి? ఎలా దరఖాస్తు చేయాలి?