Instagram Custom Stickers : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫోన్‌లో ఫొటోలతో కస్టమ్ స్టిక్కర్లు క్రియట్ చేసి షేర్ చేయొచ్చు!

Instagram Custom Stickers : మెటా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా కస్టమైజ్ స్టిక్కర్ మేకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీ ఫోటోల నుంచి కస్టమైజ్ స్టిక్కర్‌లను రూపొందించడానికి యూజర్లను అనుమతిస్తుంది.

Instagram Custom Stickers : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వాట్సాప్‌ (Whatsapp)తో సహా తన ప్లాట్‌ఫారమ్‌కు కొత్త AI టూల్ తీసుకువస్తున్నట్లు (Meta) ఇటీవలే ప్రకటించింది. ఈ ఇన్‌స్టా ఏఐ టూల్స్‌లో AI స్టిక్కర్‌ల (Instagram AI Stickers) వంటి ఫీచర్‌లు ఉంటాయి. టెక్స్ట్ కమాండ్‌లను ఉపయోగించి కస్టమైజ్ చేసిన స్టిక్కర్‌లను రూపొందించడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్‌లో ఉండగానే మెటా ఇన్‌స్టాగ్రామ్ యాప్ కోసం కొత్త కస్టమైజడ్ స్టిక్కర్ మేకర్ ఫీచర్‌ను సైలంట్‌గా యాడ్ చేసినట్టు కనిపిస్తోంది.

వాట్సాప్ మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీచర్ ఫొటోల నుంచి కస్టమైజ్డ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేయడానికి స్నేహితులకు షేర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇన్‌స్టా వినియోగదారులందరికీ అందుబాటులో లేనప్పటికీ, మెటా త్వరలో ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతానికి ఈ ఏఐ ఫీచర్ నోటిఫికేషన్ ద్వారా iOS యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీచర్‌ను అందించింది. కస్టమైజడ్ స్టిక్కర్‌ను ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టిక్కర్‌లను ఎలా క్రియేట్ చేయాలంటే? :
ఈ కొత్త ఏఐ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వచ్చినప్పటికీ, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోని గ్యాలరీ ఫొటో నుంచి కస్టమ్ స్టిక్కర్‌ను ఎలా క్రియేట్ చేయగలరో ఇప్పుడు చూద్దాం..

Read Also : iPhone Loss On Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆపిల్ ఐఫోన్ కొనబోయాడు.. అకౌంట్లో రూ.29 లక్షలు మాయం.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండాలంటే?

* ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి కొత్త స్టోరీ లేదా రీల్‌ని క్రియేట్ చేయండి.
* స్టిక్కర్ ఐకాన్ ట్యాప్ చేయండి.
* ‘Create’ స్టిక్కర్ ఆప్షన్ ఎంచుకోండి.
* స్టిక్కర్‌ని క్రియేట్ చేసేందుకు మీరు ఉపయోగించాలనుకునే ఫొటోను ఎంచుకోండి.
* మీరు స్టిక్కర్‌గా మార్చాలనుకునే ఫొటో భాగాన్ని కనుగొనేందుకు మీ వేలిని ఉపయోగించండి.
* మీరు స్టిక్కర్‌తో సంతోషంగా ఉన్న తర్వాత ‘Done’ బటన్‌ను నొక్కండి.

మీ కస్టమ్ స్టిక్కర్ ఇప్పుడు మీ స్టిక్కర్ ప్యాలెట్‌లో సేవ్ అయింది. మీరు దీన్ని మీ భవిష్యత్ స్టోరీలు లేదా రీల్స్‌లో దేనిలోనైనా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా, ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు దీనికి సంబంధించి (Instagram) నుంచి నోటిఫికేషన్‌ను పొందవచ్చు. AI స్టిక్కర్ ఫీచర్ విషయానికొస్తే.. యాప్ ఫ్యూచర్ అప్‌డేట్స్ టూల్ అందుబాటులో ఉంటుంది. AI క్రియేట్ చేసిన స్టిక్కర్లు టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి కస్టమ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

Instagram Custom Stickers

మల్టీ స్పెషల్ హై క్వాలిటీ స్టిక్కర్లు :
ఈ ఫీచర్ మెటా పెద్ద లాంగ్వేజ్ మోడల్ లామా 2 (Lama 2) ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. సెకన్లలో మల్టీ స్పెషల్ హై-క్వాలిటీ స్టిక్కర్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. AI- రూపొందించిన స్టిక్కర్‌లు (Facebook) స్టోరీస్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ (Instagram Stories), Direct Messages (DM) లు, మెసెంజర్, వాట్సాప్‌లలో అందుబాటులో ఉంటాయి. వచ్చే నెలలో ఎంపిక చేసిన ఇంగ్లీష్ లాంగ్వేజీ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.

కొత్త జనరేటివ్ ఏఐ టూల్స్ :
ఇంతలో, AI స్టిక్కర్ మేకర్‌తో పాటు, మెటా కనెక్ట్ ఈవెంట్‌లో కొత్త జనరేటివ్ AI టూల్స్ కూడా ప్రకటించింది. ఈ టూల్స్ వినియోగదారులు ఫొటోలను ఎడిట్ చేసేందుకు టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి స్టిక్కర్‌లను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. AI ఇమేజ్ ఎడిటింగ్ (Instagram)లో అందుబాటులో ఉంటుంది. AI రూపొందించిన చాట్ స్టిక్కర్లు Instagram, Facebook, WhatsApp, Messengerలో అందుబాటులోకి వస్తాయి.

ఇన్‌స్టాగ్రామ్ 2 కొత్త AI ఫొటో ఎడిటింగ్ రీస్టైల్, బ్యాక్‌డ్రాప్ ఫీచర్‌లను అందిస్తుంది. వాటర్ కలర్ లేదా మ్యాగజైన్ కోల్లెజ్ వంటి టెక్స్ట్ ప్రాంప్ట్‌తో యూజర్లు తమ ఫొటోల స్టైల్‌ను మార్చుకోవడానికి రీస్టైల్ అనుమతిస్తుంది. రెండో ఫీచర్ ‘బ్యాక్‌డ్రాప్’ యూజర్లు ‘beach at Sunset’ వంటి టెక్స్ట్ ప్రాంప్ట్‌తో ఫొటోల బ్యాక్‌గ్రౌండ్ మార్చడానికి అనుమతిస్తుంది.

Read Also : Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ 90 సెకన్లు కాదు.. 10 నిమిషాలకు పొడిగింపు..!

ట్రెండింగ్ వార్తలు