Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ 90 సెకన్లు కాదు.. 10 నిమిషాలకు పొడిగింపు..!

Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు అదిరే న్యూస్.. రీల్స్ వ్యవధి చాలా తక్కువగా ఉందని భావిస్తున్నారా? ఇకపై 90 సెకన్ల రీల్స్ వ్యవధి 10 నిమిషాలకు పెరగనుంది.

Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ 90 సెకన్లు కాదు.. 10 నిమిషాలకు పొడిగింపు..!

Instagram Reel duration might be expanded to 10 minutes, just like TikTok and YouTube

Instagram Reel Duration : పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫారమ్ టిక్‌టాక్ (TikTok), యూట్యూబ్‌ (Youtube)లకు పోటీగా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) వ్యవధిని పొడిగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. లీకర్ అలెశాండ్రో పలుజ్జీ ప్రకారం (Alessandro Paluzzi).. రాబోయే రీల్స్ గరిష్టంగా 10 నిమిషాల వ్యవధిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం, షార్ట్-వీడియో ఫార్మాట్ రీల్స్ 90 సెకన్ల వరకు వ్యవధిని కలిగి ఉన్నాయి. టిప్‌స్టర్ (X)లో అప్‌డేట్ స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేశారు.

Read Also : Jio vs Airtel Monthly Fiber Plans : యూజర్లకు పండగే.. జియో, ఎయిర్‌టెల్ నెలవారీ ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ల ఫుల్ లిస్టు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోటీదారులు 2022లో షార్ట్ వీడియో టైమ్ లిమిట్ 10 నిమిషాలకు పొడిగించాయి. యూట్యూబ్ (Youtube) కూడా ‘లాంగ్-ఫారమ్ వీడియో’ ఫార్మాట్ అందించింది. ఇన్‌స్టాగ్రామ్ ఈ ఆప్షన్ లాంచ్ చేస్తే.. ప్లాట్‌ఫారమ్‌లోని క్రియేటర్లు, వివరణాత్మక బ్యూటీ ట్యుటోరియల్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్, కుకింగ్ డెమోలు, మరిన్నింటిని పోస్ట్ చేయగలరు. ముఖ్యంగా, యూజర్లందరికి ఈ ఆప్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త టూల్‌ :
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త టూల్‌ను కూడా పరిచయం చేసింది. యూజర్ల పోస్ట్‌లపై నిర్దిష్ట వ్యాఖ్యలను లేదా స్టోరీలపై రీల్స్‌ను షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ, ఆడమ్ మోస్సేరి ఇటీవల ఈ ఫీచర్‌ను పబ్లిక్ అకౌంట్లలో టెస్టింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు. యూజర్ల పోస్ట్‌లు లేదా రీల్స్‌పై ప్రత్యేక వ్యాఖ్యలను వారి స్టోరీలకు షేర్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. కామెంట్‌పై స్వైప్ చేసి, ‘Add to Story‘పై Tap చేయండి. ఒరిజినల్ పోస్ట్‌తో పాటు స్టోరీస్‌లో కనిపిస్తుంది.

Instagram Reel duration might be expanded to 10 minutes, just like TikTok and YouTube

Instagram Reel duration might be expanded to 10 minutes, just like TikTok and YouTube

ముఖ్యంగా, ఈ ఫీచర్ ఇంకా యూజర్లందరికి అందుబాటులో లేదు. ఫొటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇక్కడ వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో వారి ఫొటోను కరోజల్‌కు మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. స్నేహితులతో లేదా మీ కెమెరా రోల్‌లోని క్షణాలను షేర్ చేస్తున్నా, ఇప్పుడు మీ ఫొటో కరోజల్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఫీడ్ ఫొటోల కోసం మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా ఎవరైనా మూడ్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు.

తద్వారా కరోజల్‌లో ఒక పాటను యాడ్ చేసుకోవచ్చు. రీల్స్‌లో గరిష్టంగా ముగ్గురు క్రియేటర్‌లతో కలిసి పని చేయడానికి అనుమతి ఉంటుంది. వినియోగదారులు పబ్లిక్, ప్రైవేట్ అకౌంట్లతో కలిసి పని చేయవచ్చు. దాంతో ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులను చేరుకోవచ్చు. మీ అకౌంట్ ప్రైవేట్‌గా ఉంటే.. మీ సొంత పోస్ట్ లేదా రీల్‌ను ప్రారంభించవచ్చు. తద్వారా మిమ్మల్ని ఫాలో అయ్యే వరకు ఫాలోవర్లను ఇన్వైట్ చేసుకోవచ్చునని (Instagram) వెల్లడించింది.

Read Also : Google Pixel 8 Launch : సరసమైన ధరకే గూగుల్ పిక్సెల్ 8 ఫోన్.. అక్టోబర్ 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?